అది కాఫీ అయితే.. ఇది ఖుషీ

0Dil-Raju-on-Fidaa-Movieనిజానికి శేఖర్ కమ్ముల సినిమాలంటే అందరికీ భయమే. ఎందుకంటే ధియేటర్ దగ్గర వాటికి ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేదు. అయితే బ్లాక్ బస్టర్ అవ్వొచ్చు.. లేదంటే డిజాష్టర్ కూడా అవ్వొచ్చు. మరో రెండు వారాల్లో మనోడు తీసిన ”ఫిదా” ధియేటర్లకు వస్తోంది. ఈ సినిమాపై ఆడియో లాంచ్ తరువాత కాస్త హైప్ పెరిగింది. ఎలాగో దిల్ రాజు ప్రొడక్షన్ కాబట్టి మ్యాగ్జిమం ధియేటర్లలో పడుతుంది. ఇంతకీ రిజల్ట్ ఎలా ఉండోబోతోంది?

”ఆనంద్ కాఫీ లాంటి సినిమా అయితే. ఫిదా ‘ఖుషీ’ లాంటి సినిమా” అంటూ నిర్మాత దిల్ రాజు ఒకటే సాలిడ్ స్టేట్మెంట్ చెబుతున్నాడు. సినిమాను పూర్తిగా ఎడిటింగ్ అయ్యాక చూసిన దిల్ రాజు.. వండర్ ఫుల్ అని చెబుతున్నాడు. పైగా ఈ ప్రాజెక్టుకు ఆయన ఒక సెంటిమెంట్ కూడా అద్దేశాడు. ”అప్ కమింగ్ హీరో ప్రేమకథలు చేస్తే ఎప్పుడూ బాగుంటాయి. సుస్వాగతం తొలిప్రేమ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద హిట్లు అయ్యాయ్. అర్జున్ కు ఆర్యా కూడా అంతే. కెరియర్ స్టార్టింగులో అలాంటి సినిమాలు చేస్తే తప్పకుండా ఆడేస్తాయి” అంటూ తన కాన్ఫిడెన్స్ చూపించాడు. కాని విషయం ఏంటంటే.. రామ్ చరణ్ ”ఆరెంజ్” కూడా కెరియర్ స్టార్టింగులో చేసిన లవ్ స్టోరీయే. ఇప్పుడు టివిల్లో చూస్తే సినిమాలో చెప్పిన పాయింట్ కరక్టే కాని అంటున్న జనాలు.. అప్పుడు ధియేటర్లలో మాత్రం చూడలేదు. సినిమా డిజాష్టర్ అయ్యింది. అందుకే ఇప్పుడు సినిమా ఏమవుతుందోనని అందరూ కాస్త టెన్షన్ పడుతున్నారు.

పైగా వరుణ్ తనకు డౌట్లు ఉన్నాయని వాటిని దిల్ రాజు నివృత్తి చేసేవారని చెప్పడం.. దిల్ రాజే స్వయంగా క్లయమ్యాక్స్ పేపర్ చదివితే నాకు సీన్ అర్ధంకాలేదు అనడం.. ఇవన్నీ కూడా ”ఫిదా” అసలు శేఖర్ కమ్ముల ఎలా తీసుంటాడో అనే సందేహాలను క్రియేట్ చేస్తున్నాయి. శేఖర్ మాత్రం.. ఇది నా కూతురు.. అద్భతం.. అంటూ చెబుతున్నాడు. సినిమా రిలీజయ్యేవరకు వరుణ్ అండ్ దిల్ రాజుకు మాత్రం టెన్షన్ టెన్షనేనట.