కళ్యాణం ముందే చూతము రారండి

0సినిమాల్ని ప్రమోట్ చేయడంలో దిల్రాజు వ్యూహాలే వేరు. ఏ సినిమాని ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలో ఆయనకి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో అనిపిస్తుంటుంది. చిన్న సినిమాకి ఒకలాగా – పెద్ద సినిమాలకి ఒకలాగా… కుటుంబ కథలకి ఒకలాగా – మాస్ చిత్రాలకి మరొకలా ఆయన ప్రచారం చేస్తుంటారు. చాలాసార్లు ఆయన ప్రచార వ్యూహాలు మంచి ఫలితాల్నే ఇచ్చాయి. ప్రస్తుతం నితిన్ తో తీస్తున్న `శ్రీనివాస కళ్యాణం`ని ఫ్యామిలీ ఆడియెన్స్ కి చేరువ చేయడంలో భాగంగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అదేంటంటే విడుదలకి వారం రోజులు ముందుగానే సినిమా కోసం పనిచేసిన వాళ్ల కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా షోలు వేయబోతున్నాడట. దాని ద్వారా మౌత్ పబ్లిసిటీ ఊపందుకొంటుందనే దిల్ రాజు వ్యూహం. ఇదివరకు శతమానం భవతికి కూడా అదే చేశారు. సేమ్ సెంటిమెంట్ ని కుటుంబ కథతోనే తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణంకి అప్లయ్ చేయబోతున్నారన్నమాట. సినిమాకి పనిచేసిన సాంకేతిక బృందంతో పాటు – పలువురు సినీ – రాజకీయ ప్రముఖులకి కూడా ఈ చిత్రాన్ని ముందుగా చూపించబోతున్నారని సమాచారం. బొమ్మరిల్లు విడుదలయిన తేదీ ఆగస్టు 9నే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మొన్న ఆడియో ఫంక్షన్ ని ఓ భారీ పెళ్లి వేడుక స్టైల్ లో చేశారు. అదే తరహాలో త్వరలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తారని సమాచారం.