దిల్ రాజు చేతికి పూరి చిత్రం…

0టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అంటే ఎవరైనా దిల్ రాజు పేరు చెప్పాల్సిందే. ఈయన నిర్మించే చిత్రాలే కాదు ఈయన విడుదల చేసే చిత్రాలకు సైతం మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఈయన బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే చాలు ఖచ్చితంగా విజయం సాదిస్తుందని నమ్ముతారు. తాజాగా ఈయన పూరి తెరకెక్కిస్తున్న మెహబూబా సినిమాను వరల్డ్ వైడ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

1971 ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నైపథ్యంలో నడిచే ప్రేమ కథగా పూరి ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. పూరి తనయుడు ఆకాష్ హీరో గా నటిస్తుండగా , నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ ని మే 11న వేసవి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసారు.

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ చౌత స్వరాలు సమకూరుస్తున్నారు.