బన్నీకి 96 కనెక్షన్!!

0

దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమా అయినా లేక స్వయంగా నిర్మించేదైనా చాలా క్యాలికులేటెడ్ గా ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. అయినా కూడా ఆయన లెక్కలు అప్పుడప్పుడు తప్పుతూనే ఉంటాయి. గత ఏడాది 6 సినిమాలతో సన్మానాలు చేయించుకుంటే ఈ సంవత్సరం రెండే విడుదల చేస్తే అవి పెద్ద షాక్ ఇచ్చాయి. రాబోయే హలో గురు ప్రేమ కోసమే అన్ని కవర్ చేసేస్తుందని ధీమాలో ఉన్నారు దిల్ రాజు. దాని సంగతలా ఉంచితే గత నాలుగైదు రోజుల నుంచి ఇంకా విడుదల కానీ తమిళ సినిమా 96 గురించి దిల్ రాజు హడావిడి చేయడం చూసి సీని వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. మొన్న నానిని చెన్నై తీసుకెళ్లి మరీ స్పెషల్ షో వేయించి సూపర్ అనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాడు. నాని సమంతాలు కలిసి ఈ సినిమా చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. అదంతా ఏమి లేదని ట్విట్టర్ లో అధికారికంగా దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ట్విస్ట్ కూడా ఈ 96 బ్యాచ్ లో చేరింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దిల్ రాజు హైదరాబాద్ లోనే 96 స్పెషల్ షో వేసి చూపించాడట. ఇంప్రెస్ అయిన బన్నీ చాలా బాగుందని చెప్పినట్టు టాక్. అసలు దిల్ రాజు బన్నీకి ఎందుకు 96 చూపించాడా అనే సందేహం రావడం సహజం. ఈ సినిమా ఒకవేళ నిజంగా బాగున్నా థీమ్ ప్రకారం అల్లు అర్జున్ కు సూట్ అవ్వదు. లేదూ జస్ట్ స్నేహ పూర్వకంగా తనతో ఉన్న అనుబంధం దృష్ట్యా బన్నీకి ఈ 96 చూపించాడా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. 22 ఏళ్ళ క్రితం 1996లో తమ స్కూల్ చదువు పూర్తయ్యాక విడిపోయిన ఓ అమ్మాయి అబ్బాయి కథే ఈ 96. కథ ప్రకారం హీరో హీరోయిన్లు కొంచెం ఏజ్ బార్ తరహాలో కనిపించాలి. నాని బన్నీలకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా వాళ్లకు ఇలాంటివి ఇప్పుడు సెట్ కావు. మరి దిల్ రాజు ఏ ఉద్దేశంతో ఈ సినిమాను అదే పనిగా చూపిస్తున్నాడో అర్థం కావడం లేదు.

ఈ గురువారమే విడుదల కాబోతున్న 96 మీద కోలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. విజయ్ సేతుపతి సరసన త్రిష మొదటిసారి నటించడం వల్ల బజ్ ఇంకాస్త పెరిగింది. ఇంకో మూడు రోజులు ఆగితే ఎలాగూ ఫలితం తెలిసిపోతుంది. ఒకవేళ అద్భుతం అనే టాక్ వస్తే ఒక ప్లాన్ తో లేదు సోసోగానే ఉంది అనే రిపోర్ట్ వస్తే మరో ప్లాన్ తో దిల్ రాజు ప్రిపేర్డ్ గా ఉన్నట్టు సమాచారం. వ్యక్తిగతంగా మనకు ఎంత నచ్చినా ఫైనల్ గా సాధారణ ప్రేక్షకుడికి సినిమా నచ్చిందా లేదా అనే దాన్ని బట్టే రీమేక్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి అంత స్పెషల్ గా ప్రచారమవుతున్న ఈ 96 కథేంటో ఇంకో మూడు రోజుల్లో తేలిపోతుంది.
Please Read Disclaimer