వాట్సాప్ లో ఒక దణ్ణం పంపించాను!

0

`మహర్షి` మహేష్ కెరీర్ మైలురాయి అవుతుందా? అభిమానుల్లో ఆసక్తికర చర్చ ఇది. ఈ విషయంలో మహేష్ కంటే కూడా తొలి నుంచీ నిర్మాత దిల్ రాజు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇటీవల ప్రతి మీడియా ఇంటరాక్షన్ లోనూ ఆయన ఎగ్జయిట్ మెంట్ మీడియాకి అర్థమైంది. మహర్షి.. మహేష్ కెరీర్ బెస్ట్ సినిమా అవుతుంది. బెస్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్ .. కంటెంట్ ఉన్న చిత్రమిదని దిల్ రాజు పదే పదే మీడియా ఇంటరాక్షన్స్ లో చెప్పారు.

అందుకు తగ్గట్టే నేటి సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లోనూ దిల్ రాజు ఎమోషన్ అయిన తీరు చూస్తే మహర్షిలో నిజంగానే అంత మ్యాటర్ ఉందా? అన్న ఆశ్చర్యం కలగక మానదు. మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై దిల్ రాజు ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. “ఊపిరి రిలీజయ్యాక వంశీ .. మహేష్ కి లైన్ వినిపించాడు. మహేష్ చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా చేస్తున్నానని వంశీతో మహేష్ అనగానే అతడు ఆల్మోస్ట్ కన్నీళ్లపర్యంతం అయ్యాడు. ఏడాదిన్నర శ్రమ ఫలించింది. వంశీ ఐదు సినిమాల్లో ది బెస్ట్ ఇది. పెద్ద మైలురాయి చిత్రమిది. ఈ సినిమా అప్పటికి ఇంకా పూర్తవ్వలేదు.. డబుల్ పాజిటివ్ చూశాను.. అది చూశాక ఒక అద్భుతమైన సినిమా తీశావని వాట్సాప్ లో వంశీ పైడిపల్లికి ఒక దండం పంపించాను.. అంత గొప్పగా తీశాడు. అంతేకాదు షూటింగ్ చివరి రోజు ఆన్ లొకేషన్ కి వెళ్లాను. అక్కడ వంశీ సహా అందరికీ హగ్ ఇచ్చాను.. మహేష్ గారు స్వతహాగానే షేక్ హ్యండ్ ఇస్తారు. కానీ ఆ రోజు ఆయనే నాక్కూడా హగ్ ఇవ్వండి అన్నారు. సినిమా అయిపోయాక .. ఒక సూపర్ స్టార్ హగ్ ఎంతో గొప్పగా అనిపించింది“అని తెలిపారు. ఫ్యాన్స్ ను ఉద్ధేశించి మాట్లాడిన దిల్ రాజు.. “మే 9 రాసి పెట్టుకోండి.. ఈ సినిమా ఎంత హిట్ కావాలో కోరుకోండి. మే 9న అది నెరవేరబోతోంది“ అని అన్నారు.

మహేష్ అభిమానులూ.. మీకు ఎంత పెద్ద హిట్ కావాలన్న ఆశ ఉంది? మీ కోరిక ఎంతైనా కోరుకోండి. మే9న అది తీరబోతోంది. ఈ సినిమాకి ముగ్గురు నిర్మాతలం కలిసి చేశాం. చేయాల్సొచ్చింది. ఇక ట్రైలర్ చూసి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టారు అని మెసేజ్ లు వచ్చాయి. దత్.. నేను.. పీవీపీ అందరం అదే ఫీల్ అవుతున్నాం. మోహనన్ బ్యూటిఫుల్ విజువల్స్ .. స్మైలీ మ్యాన్ ఎనర్జీ ఇచ్చారు. దేవీ మ్యూజిక్ అద్భుతం. వంశీ 2017లో దేవీకి అమెరికాలో కథ చెప్పాడు. ఇప్పటివరకూ ఒకటిన్నర సంవత్సరాలు ట్రావెల్ చేశారు. ప్రతి సినిమాలో కమర్షియల్ సాంగ్స్ .. ఆరు పాటలు ఉంటాయి. కానీ ఈ సినిమాలో 2 పాటలు.. 4 మాంటేజెస్ సాంగ్స్ ఉన్నాయి. ఎంతో కష్టపడి చేశారు దేవీశ్రీ. మొత్తం ఆల్బమ్ థియేటర్ లో మార్మోగిపోతుంది. శ్రీమణి పదర పదర సాంగ్ సహా లిరిక్స్ అద్భుతంగా రాశారు. తను మరో సీతారామశాస్త్రి అయ్యాడు.. అని దిల్ రాజు ప్రశంసించారు.
Please Read Disclaimer