బాలీవుడ్‌ నటుడికి మళ్లీ అస్వస్థత

0dilip-kumarప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (94) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బుధవారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. డీహైడ్రేషన్‌ కారణంగా దిలీప్‌ కుమార్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా దిలీప్‌కుమార్‌ గత రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఉదయ తారా నాయర్‌ తెలిపారు.

ఇంతకుముందు కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో దిలీప్‌కుమార్‌ ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. అయితే ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. అప్పట్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందిన విషయం తెలిసిందే. దిలీప్‌ కుమార్‌ చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు.