ఎన్టీఆర్ దర్శకుడికి ప్రమోషన్ వచ్చింది

0

యువ దర్శకుడు బాబీ మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ ను దక్కించుకుని ఆ వెంటనే పవన్ తో సినిమా చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఈయన తెరకెక్కించిన చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా బాబీకి మాత్రం మంచి క్రేజ్ దక్కింది. బాబీ చిత్రాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబట్టాయి.

బాబీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘జైలవకుశ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ తో త్రిపాత్రాభినయం చేయించి ఎన్టీఆర్ కెరియర్ లో గుర్తుండిపోయే చిత్రంగా ‘జై లవకుశ’ని తెరకెక్కించాడు. ప్రస్తుతం బాబీ ఓ మల్టీస్టారర్ ను తెరకెక్కించడానికి సిద్దమవుతున్నాడు. సినిమా జీవితం ఇలా ఉండగా తన వ్యక్తిగత జీవితంలో మరొక మెట్టు ఎక్కేశాడు. బాబీ సతీమణి నేడు (అక్టోబర్10) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

రోజులాగే ఈ రోజు కూడా సాదారణంగా గడిచిపోతుందనుకున్నా కానీ జీవితంలో మరిచిపోలేని రోజుగా మిగిలింది అంటూ బాబీ ట్వీట్ చేశాడు. ఫ్యామిలీ కొంచెం పెద్దదయింది – మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ తండ్రిగా ప్రమోషన్ వచ్చినందుకు బాబీ చాలా సంతోషపడుతున్నాడు. ఈ సంతోష క్షణాలను అభిమానులతో పంచుకుని మరింత మురిసిపోతున్నాడు. తండ్రి అయిన ఈ యంగ్ దర్శకుడికి పలువురు సినీతారలు – అభిమానుల నుండి శభాకాంక్షలు అందుతున్నాయి.
Please Read Disclaimer