నటిపై అతి చేసిన నటుడు అరెస్ట్

0director-and-hero-rape-attemptఒక వర్థమాన నటి మీద లైంగిక దాడి చేసేందుకు వర్థమాన హీరో సృజన్.. వర్థమాన దర్శకుడు ప్రయత్నించిన వైనం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఇద్దరిపై సదరు నటి విజయవాడలోని పడమట పోలీసులకు ఫిర్యాదు చేయటం.. వర్థమాన దర్శకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

సినిమా షూటింగ్ కోసం కారులో వెళుతున్న నటి పట్ల నటుడు.. దర్శకుడు అసభ్యంగా ప్రవర్తించారు. హైదరాబాద్కు చెందిన నటిని షూటింగ్ కోసమని భీమవరానికి ప్రయాణమయ్యారు. ప్రయాణానికి నటి కారును నటుడు.. దర్శకుడు ఉపయోగించారు. విజయవాడ సమీపానికి వచ్చేసరికి నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. తనపై జరుగుతున్న లైంగిక దాడిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించిన నటిని కొట్టి.. వెనుక సీట్లు పడేశారు.

కదులుతున్న కారులో నుంచి నటి ఎక్కడ దూకేస్తుందోనన్న ఉద్దేశంతో కారును వేగంగా నడిపాడు దర్శకుడు. ఈ హడావుడిలో పక్కనున్న లారీని గుద్దేశారు. దీంతో కారు భారీగా దెబ్బ తింది. కారు ప్రమాదానికి గురి కావటంతో.. గాయపడిన నటిని అక్కడి వారు ఆసుపత్రికి తరలించారు.

చికిత్స తర్వాత నటిని తీసుకొని నిర్మాత ఇంటికి తీసుకెళ్లి ఈ విషయాన్ని వదిలేయాలన్నారు. ఫిర్యాదు చేస్తే సినిమా అవకాశాలు రావని బెదిరించారు. నిర్మాత ఇంటికి తీసుకెళ్లిన నటి.. స్నేహితుల సహకారంతో బయటపడి.. తనకు జరిగిన అన్యాయం గురించి పడమట పోలీసులకు నటి ఫిర్యాదు చేశారు. దీంతో వర్ధమాన దర్శకుడు చలపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నటుడు సృజన్ పరారయ్యారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా గాలింపులు జరిపిన పోలీసులకు తాజాగా దొరికేశాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.