మరో రెండు చరిత్రలు తీస్తానంటున్న క్రిష్

0krish-directorటాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా వచ్చిన శాతకర్ణి.. ఆయన కెరీర్ బెస్ట్ గా నిలవడమే కాదు.. బాలయ్యను 50 కోట్ల క్లబ్ లోకి చేర్చింది. యూఎస్ఏలో బాలయ్య మూవీస్ కి అసలు మార్కెట్ లేని పరిస్థితుల్లో.. దాదాపు 2 మిలియన్ డాలర్లను రాబట్టింది. 2000వేల సంవత్సరాల క్రితం నాటి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను.. దర్శకుడు క్రిష్ అద్భుతంగా చూపించడంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పడం అతిశయోక్తి కాదు. బాలయ్య నటనా సామర్ధ్యం ఒక ఎత్తయితే.. క్రిష్ ట్యాలెంట్ మరోవైపు ఈ మూవీకి సహకరించాయి.

ఇప్పటివరకూ కమర్షియల్ సక్సెస్ చూడని క్రిష్ కు.. శాతకర్ణి చాలానే ఉత్సాహాన్ని ఇచ్చింది. అత్యంత వేగంగా ఆ చిత్రాన్ని తీయగలగడం.. తెలుగు చరిత్రపై మరిన్ని సినిమాలను తీయాలనే ఆలోచనకు స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు మరో రెండు హిస్టారికల్ మూవీస్ తీస్తానని చెబుతున్నాడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. శ్రీకృష్ణ దేవరాయలు కథతో పాటు.. గౌతమబుద్ధుడిపై కూడా సినిమాలు తీస్తానని చెప్పాడు.

కృష్ణ దేవరాయలు పాత్ర.. తెలుగు ఆడియన్స్ కు పరిచితమే. తిరుమల నిర్మాణానికి.. తెలుగు ఖ్యాతిని పెంచేందుకు.. ఆయన కృషి అసామాన్యం. మరోవైపు భారత్ లో పుట్టి చైనీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆరాధ్యుడైన గౌతమబుద్ధుడి కథ కూడా ఆసక్తి కలిగించేదే. తను ఎంచుకునే కాన్సెప్టులతోటే సగం సక్సెస్ సాధించేస్తున్నాడు క్రిష్.