క్రిష్ కూడా అదే ఫాలో అవుతున్నాడా?

0ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలలో చాలా మంది దర్శకులు విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రత్యేక కథలను సృష్టిస్తున్నారు. మరికొందరు కథలోనే VFX అవసరమయ్యేలా సెటప్ చేసుకుంటున్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ వల్ల సినిమాల విడుదలపై ప్రభావం చాలానే పడుతోంది. ఇంతకుముందు అనుకున్న సమయానికి ఎలాగోలా ఫినిష్ చేసి రిలీజ్ చేసేవారు కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ VFX పనుల కోసం తేదీలను మార్చేస్తున్నారు.

రాజమౌళి శంకర్ లాంటి అగ్ర దర్శకులే గ్రాఫిక్స్ వల్ల ఆలోచనలను మార్చుకున్నారు. ముఖ్యంగా 2.0 విషయంలో దర్శకుడు శంకర్ చాలానే సతమతమవుతున్నాడు. సరైన అవుట్ ఫుట్ వచ్చే వరకు విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ ను విడిచి పెట్టడం లేదు. ఇక అదే తరహాలో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ కూడా అడిక్ట్ అయ్యాడు. కంగనా రనౌత్ తో ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్ లో మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే VFX పనులు ఒక దశకు వస్తే గాని రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. ముందే ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి VFX పనులు ఓ కొలిక్కి రాకపోవడంతో విడుదల తేదీని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత ఆలస్యం అయినప్పటికీ సినిమాకు తగ్గట్టు ఎఫెక్ట్స్ వచ్చిన తరువాతే సినిమాను రిలీజ్ చెయ్యాలని మరోవైపు నిర్మాతలు కూడా క్రిష్ కు మద్దతుగా నిలుస్తున్నారట. మరి సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.