మెగాస్టార్ పై అత్యాచారం చేసేవాడ్ని..

0అద్భుతంగా చెప్పాలనుకున్నాడు. కానీ ఆ పదాలను వెతుక్కునే క్రమంలో పెద్ద మాటను తూలాడు.. ఓ మెగా స్టార్ ను పట్టుకొని వర్ణించే క్రమంలో నోరుజారి ఇరుకున పడ్డాడు. ఆ దర్శకుడి వికారమైన మాటలకు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదేం పోలిక అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మలయాళం ఫిలిం ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టిపై తాజాగా దర్శకుడు మిస్కిన్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. పాపం మిస్కిన్ మమ్ముట్టి నటనను ఎలా పొగడాలో తెలియక అడ్డదిడ్డంగా వాగి బుక్కై పోయాడు. మమ్ముట్టి హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో ‘పెరాన్బు’ అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న మిస్కిన్ – పెనాన్బు సినిమాలో మమ్ముట్టి నటనను ఆకాశానికెత్తేశాడు..

మిస్కిన్ మాట్లాడుతూ ‘సినిమాలో మమ్ముట్టి కాకుండా మరొకరు నటించి ఉంటే ఓవర్ యాక్షన్ చేసేవారు.. మమ్ముట్టి చాలా బాగా నటించాడు. ప్రేక్షకులు ఆయన్ను చూస్తూ ఉండిపోతారు. నేను వయసులో ఉండి మమ్ముట్టి ఆడపిల్ల అయ్యి ఉంటే ఆయన్ని అత్యాచారం చేసేవాడిని.. అసభ్యంగా మాట్లాడుతున్నానని అనుకోకండి.. మమ్ముట్టి నటన గురించి మీకు అర్థమవ్వాలని ఇలా మాట్లాడుతున్నా’ అంటూ మిస్కిన్ పోల్చిన విధానం వివాదాస్పదమైంది. స్టార్ హీరోపై అత్యాచారం చేస్తానంటావా అంటూ సోషల్ మీడియాలో మిస్కిన్ ను ఏకిపారేస్తున్నారు. పొగిడేందుకు మాటలే లేవా అంటూ ఫైర్ అవుతున్నారు.