ఆమెను వద్దన్నందుకు ఇప్పుడు ఫీలవుతున్నాడట

0Nandita-Swethaనందిత శ్వేత.. రెండు మూడు రోజులుగా టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ అమ్మాయి గురించే చర్చించుకుంటున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో ఆ రేంజిలో అదరగొట్టేసింది ఈ బెంగళూరు బ్యూటీ. ఆమె కనిపించేది సగం సినిమాలోనే కానీ.. ఆ సగం సినిమాలోనే తన పెర్ఫామెన్స్‌తో దుమ్ముదులిపింది నందిత. హెబ్బా పటేల్‌తో ఎంత గ్లామర్ షో చేసినా.. సినిమాలో నందితే హైలైట్ అయింది. దర్శకుడు వీఐ ఆనంద్ ఏరి కోరి ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నాడో సినిమా చూశాక అందరికీ అర్థమైంది. ఐతే నాలుగేళ్ల కిందటే తమిళంలో కథానాయికగా పరిచయమై.. తన నటనతో మంచి పేరు సంపాదించిన నందిత.. తెలుగులోకి రావడానికి చాలా లేటైంది.

ఐతే ఆమెకు తెలుగులో అవకాశాలు రాకుండా ఏమీ లేదట. కొన్ని సినిమాలు.. ఆమెకు నచ్చక.. ఇంకొన్ని సినిమాల విషయంలో ఈమె నచ్చక ఏ ప్రాజెక్టూ ఓకే అవ్వలేదట. ఐతే తనను వద్దన్న దర్శకుల్లో ఒకరు ఇప్పుడు ఫీలవుతున్నారని.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చూసి ఆ దర్శకుడు ఫోన్ కూడా చేశాడని నందిత చెబుతోంది. చాలా మంది హీరోయిన్ల విష‌యంలో జ‌రిగేదే నాకూ జరిగింది. తెలుగు సినిమాల కోసం నాతో ఇంతకుముందు సంప్రదింపులు జరిగాయి. కానీ కొన్ని సబ్జెక్టులు నాకు నచ్చకపోవడంతో అవకాశాలు వదులుకున్నాను. కొందరు నన్ను వద్దనుకున్నారు. ఐతే నన్ను వద్దన్న దర్శకుడు ఒకరు ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చూసి ఫీలయ్యాడు. నాకు ఫోన్ చేసి.. ‘నువ్వు ఈ స్థాయిలో పెర్ఫామ్ చేస్తావని అనుకోలేదు. నా ప్రాజెక్ట్ లో నేను నిన్ను మిస్సయ్యాను’ అంటూ ఫీలయ్యాడు. ఆయన అలా అన్నాడంటే నేను స‌క్సెస్ అయిన‌ట్టేగా’’ అని నందిత పేర్కొంది.