తేజ మళ్ళీ మొదటికే వచ్చారా ?

0

నువ్వు నేను-జయం-చిత్రం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుని ఏకంగా మహేష్ బాబుతో నిజం చేసే లెవెల్ కు చేరుకున్న దర్శకుడు తేజ ఆ తర్వాత తన మేజిక్ కోల్పోయాడు. కొన్నేళ్ల పాటు వరస పరాజయాలు వెంటాడుతూనే వచ్చాయి. ఈ విషయంలో గురువు వర్మనే ఫాలో అవుతున్నాడంటూ గట్టి కామెంట్స్ వినిపించాయి. అయితే రెండేళ్ల క్రితం రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రి మరీ అద్భుతం కాకపోయినా తేజలోని టెక్నీషియన్ ఇంకా సజీవంగా ఉన్నాడని నిరూపిస్తూ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. తేజ ఫాన్స్ కూడా రిలాక్స్ అయ్యారు.

అందుకే హీరో పరంగా కాకుండా తేజ బ్రాండ్ మీద కాజల్ అగర్వాల్ ఇమేజ్ మీదే సీత ఎక్కువ ప్రమోట్ అయ్యి నిన్న థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఆశించిన విధంగా ఏమంత పాజిటివ్ టాక్ తో సీత ఓపెన్ కాకపోవడం కొంత ఆందోళనకు గురి చేస్తోంది. హీరో పాత్రను తీర్చిదిద్దిన తీరు లెన్త్ మరీ రెండు ముప్పాతిక గంటల దాకా ఉండటం పాటలు కనెక్ట్ అయ్యేలా లేకపోవడం ఇవన్నీ బాగానే ప్రభావం చూపిస్తున్నాయి. మరీ బ్యాడ్ కాదు కానీ సీత మీద పెట్టుకున్న అంచనాలలో సగమైనా అందుకుందా అనే అనుమానం టాక్ ని చూస్తే వస్తోంది.

రివ్యూస్ కూడా సీతకు ఫెవర్ గా లేవు. దీంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు సక్సెస్ నిరీక్షణ తప్పదని సోషల్ మీడియాలో ట్రాల్స్ మొదలైపోయాయి. మొత్తానికి తేజ నుంచి చాలా ఆశిస్తే ఆయన మళ్ళీ మొదటికే వచ్చారని నేనే రాజు నేనే మంత్రి తరహా పనితనం సీతలో లేదని వాటిలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాజల్ పెర్ఫార్మన్స్ సోను సూద్ విలనీ కొంత వరకు కాపాడినా’ అవి ఎంత వరకువ వసూళ్లకు హెల్ప్ అవుతుందనేది వేచి చూడాలి
Please Read Disclaimer