నన్ను వాడేసుకుంటున్నారు: తమన్నా

0Tamannaతమన్నా. గ్లామర్ కు  కేరాఫ్. సినిమాలో ఆమె ఉందీ అంటే చాలు. గ్లామర్ కు కొదవ లేనట్టే. ఏదో బాహుబలి లాంటి సినిమాల్లో తప్ప.. దాదాపుగా ఆమె చేసినవన్నీ అలాంటి కేరెక్టర్సే. అదే విషయం ఇప్పుడు తమన్నాను.. చాలా బాధపెడుతోంది.

తనను గ్లామర్ రోల్స్ కు మాత్రమే వాడుకుంటున్నారని.. ఆవేదన చెందుతోంది. రీసెంట్ గా సురాజ్ అనే డైరెక్టర్.. హీరోయిన్లకు కోట్ల రూపాయల రెమ్యునరేరషన్ ఇచ్చేది.. గ్లామర్ కోసమే అని కామెంట్ చేశారట. అది తమన్నా గురించే అని ఓ ప్రచారం ఉంది. అందుకే.. తమన్నా ఇలా స్పందించాల్సి వచ్చిందని తెలుస్తోంది.

సినిమాల కోసం ఎంత గ్లామరస్ గా కనిపించినా.. రియల్ లైఫ్ లో మాత్రం తాను చాలా సంసార పక్షంగా.. పద్ధతిగా.. ఉంటానని తమన్నా చెబుతోంది. సినిమాకు క్రేజ్ తెచ్చేందుకే.. ఇలా పొట్టి పొట్టి బట్టలు వేయిస్తున్నారని ఆవేదన చెందుతోంది. బాహుబలిలో చేసినట్టే.. పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించాలని ఆశగా ఉన్నట్టు మనసులో మాట బయటపెట్టింది. మరి.. తమన్నాను.. లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్ రోల్స్ లో ఎప్పటికి చూస్తామో..!