యాడ్ షూటింగ్స్ లో లోఫర్ బ్యూటీ

0Disha-Patani-hotలోఫర్ బ్యూటీ దిశాపటానీ.. టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమైంది. డ్యాన్సింగ్ స్కిల్స్ విపరీతంగా ఉన్నా.. తొలి సినిమా డింకీ కొట్టడంతో ఈ భామకు టాలీవుడ్ మేకర్స్ అవకాశాలు ఇవ్వలేదు. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ అంటూ బాలీవుడ్ మూవీ చేసి హిట్ కొట్టినా.. దిశా పటానికి దక్కినదేమీ లేదు.

కుంగ్ ఫూ యోగా తప్ప.. మరే సినిమాకీ సైన్ చేయలేదు కానీ.. దిశా పటానీ మాత్రం బ్రాండ్ అండార్స్ మెంట్స్ పట్టేయడంలో ట్యాలెంట్ చూపిస్తోంది. తాజాగా రిలయన్స్ డిజిటల్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పటికే ఆ కంపెనీ కమర్షియల్స్ కోసం షూటింగ్స్ కూడా చేసేస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఈ యాడ్ షూటింగ్స్ జరుగుతుండగా.. వీటిలో కూడా అమ్మడి గ్లామర్ కం ట్యాలెంట్ రెండూ చూపించేలా డిజైన్ చేశారట.

ఇక మూవీస్ సంగతి చూస్తే కెరీర్ గ్రాఫ్ అట్టడుగు స్థాయికి చేరిపోయిందని అనుకుంటున్న టైంలో.. సడెన్ గా అమ్మడికి ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ జాకీచాన్ మూవీ కుంగ్ ఫూ యోగాలో నటించే అవకాశం వచ్చింది. ఇప్పటికే ప్రమోషన్స్ చేసుకుంటుండగా.. ఈ మూవీ ఫిబ్రవరి 3న ఇండియాలో రిలీజ్ కానుంది.