టైమ్ చూసి కొట్టిన లోఫర్ బ్యూటీ

0ఫిల్మ్ ఇండస్ట్రీలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ను చాలా మంది ఫాలో అవుతుంటారు. క్రేజ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ గట్టిగా తీసుకోవాలి. వీలైనంత వరకు లైఫ్ ను సెట్ చెలుకోవాలని ఆలోచనతో కొంత మంది చాలా డిమాండ్ చేస్తుంటారు. ఇకపోతే ఇటీవల లోఫర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన దిశా పటాని కూడా టైమ్ చూసి కొట్టిందని టాక్ వస్తోంది.

అమ్మడికి సంఘమిత్ర అనే బారి బడ్జెట్ సినిమాలో ఊహించని విధంగా అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. మొదట ఆ సినిమాలో శ్రుతి హాసన్ అనుకునప్పటిక్ ఆమె తప్పుకోవడంతో దిశాని ఒకే చేశారు. దాదాపు 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సుందర్ సి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే మొదట తారాలకు సంబంధించిన రెమ్యునరేషన్ ని క్లియర్ చేసుకున్నారు. ఆర్య జయం రవి కూడా సినిమాలో నటించనున్నారు.

అయితే ముందుగా దిశా పటానికి 3 కోట్లు అని ఫిక్స్ చేసుకున్నారు. డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే మొన్నటి వరకు బాగానే ఉన్న అమ్మడు సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని డేట్స్ క్లాష్ అవుతాయనే వంకతో ఇంకో రెండు కోట్లు పెంచేసిందట. మొత్తం 5 కోట్లకు టార్గెట్ పెట్టేసరికి చిత్ర యూనిట్ కూడా ఏమి అనలేని పరిస్థితి. పైగా ఇటీవల బాలీవుడ్ లో అమ్మడికి భాగీ సినిమాతో హిట్ దొరకడంతో ఆలోచించి 5 కోట్లు డిమాండ్ చేస్తోందని సౌత్ లో టాక్ నడుస్తోంది.