లోఫర్ బ్యూటీ జిమ్నాస్టిక్ ఫీట్స్

0జిమ్నాస్టిక్స్ చేస్తూ సర్కస్ ఫీట్లు వేయాలంటే అందుకు ప్రత్యేకించి కొంత శిక్షణ అవసరం. ఈ విషయంలో బాలీవుడ్ నాయికలు ఎంతగానో శ్రమిస్తుంటారు. ఇదివరకూ కత్రిన – తాప్సీ లాంటి నాయికలు ఈ తరహా ప్రయత్నం చేశారు. కఠోరంగా శ్రమించి ఒంటిని విల్లులా వొంచేంతగా ప్రాక్టీస్ చేసి ఔరా! అనిపించారు. `నామ్ షబానా`లో తాప్సీ ఫైట్లు – `టైగర్ జిందా హై`లో కత్రిన పోరాట సన్నివేశాలు చూసిన వాళ్లు ముక్కున వేలేసుకోవడం వెనక ఎంతో కఠోరమైన సాధన దాగి ఉంది.

ఒంటిని విల్లులా వొంచేయగలరు. రోప్ ఫైట్స్ చేయగలరు. తాళ్లు పట్టుకుని గాల్లో వేలాడుతూ సర్కస్ ఫీట్లు చేయగలరు. ఒక రకమైన ట్రాపీజ్(సర్కస్ తరహా) అనే విద్యలోనూ ఈ భామలకు ప్రవేశం ఉంది. లోఫర్ బ్యూటీ దిశా పటానీ ప్రస్తుతం ట్రాపీజ్ అనే విద్యలో ప్రత్యేకంగా శిక్షణ పొందిందిట. ఇదంతా ఎవరికోసం అంటే కండల హీరో సల్మాన్ ని మెప్పించేందుకేనట. సల్మాన్ సరసన ఈ భామ `భరత్` అనే చిత్రంలో నటిస్తోంది. ఆన్ లొకేషన్ నుంచి కొన్ని స్టిల్స్ ని సామాజిక మాధ్యమాల్లో లీక్ చేస్తూ దిశా నానా రచ్చ చేస్తోంది. మొత్తానికి ప్రియుడు టైగర్ ష్రాఫ్ నుంచి దిశా పటానీ దూరంగా ఉన్నప్పటినుంచి కొత్త కొత్త విద్యలు నేర్చుకుంటూ బాగుపడుతోంది! ఇక సల్మాన్ భాయ్ ఈ అమ్మడిని ఓ రేంజులో ఎంకరేజ్ చేస్తున్నాడట అన్నిటా!! దిశా నటించిన `ఎంఎస్ ధోని` – `భాఘి 2` చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.