బికినీలో ఉక్కిరిబిక్కిరి

0అందమనేది ఎంత చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. అందాల సుందరి దిశా పఠానీ ఈ సూత్రాన్ని చాలా గట్టిగానే నమ్ముకుంది. అందాన్ని ఇంకా అందంగా ఎలా చూపించాలో ఈ అమ్మడికి బాగానే తెలుసు. తన ఒంపుసొంపులను ఎప్పటికప్పుడు కొత్తగా చూపిస్తూ అభిమానుల్లో క్రేజ్ పెంచుకుంటూనే ఉంది.

రీసెంట్ గా బాలీవుడ్ టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన బాఘీ-2 సినిమాలో గ్లామర్ ఆరబోసి దిశా బాగానే గుర్తుంచుకుంది. దీని తరవాత ఇంతవరకు ఇంకా కొత్త సినిమా ఏదీ కమిట్ అవలేదు. ఈలోగా ప్రేక్షకులు.. బాలీవుడ్ జనాలు తనను మర్చిపోకుండా దిశా బీచ్ లో బికినీ వేసుకుని ఫొటోలకు ఫోజులివ్వవడం మొదలెట్టింది. బికినీలకు సూటయ్యే పర్ ఫెక్ట్ ఫిగర్ కావడంతో దిశా ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టకుంటున్నాయి. ఒక్కోసారి ఒక్కో యాంగిల్ లో తన అందాలతో విందు చేస్తున్న ఈ భామ తాజాగా బికినీ బ్యాక్ షేప్ చూపిస్తూ చూపరులను ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

తరచూ బికినీలతో హీటు సృష్టిస్తున్న దిశాకు ఇంటర్ నెట్ లో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఆమె బ్యూటీ అండ్ ఫిగర్ దర్శక – నిర్మాతలను బాగానే ఆకట్టుకుంటోంది. అందుకే హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించే భరత్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. సోషల్ మీడియాలోనే ఈ రేంజిలో కనిపించే ఈ భామ స్టార్ హీరో సినిమాలో ఏ రేంజిలో రెచ్చిపోతుందో?