చెల్లిని బరిలో దించుతోంది!

0కాకి పిల్ల కాకికి ముద్దు. ఈ సందర్భం అందుకు కరెక్ట్ కాదు కానీ దిశాపటానీ మురిపెం చూస్తుంటే కొంటె కుర్రాళ్లు ఇలా కామెంట్లు రువ్వుతున్నారు. కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్ గా పరిచయమై – అటుపై టాప్ మోడల్ గా ఎదిగింది దిశా. ఆ క్రమంలోనే సినిమావోళ్లు పిలిచి మరీ అవకాశాలిచ్చారు. మోడల్గా గొప్పగా రాణించిన ఈ అమ్మడు పలు కార్పొరెట్ బ్రాండ్లకు ప్రచారం చేస్తోంది. అంతేకాదు ఈ ఆధునిక ప్రపంచంలో తనని తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో పక్కాగా తెలిసిన నెరజాన. టాలీవుడ్ వరకూ పరిశీలిస్తే ఇలియానా తర్వాత మళ్లీ అంతటి కరిష్మా ఉన్న అమ్మడిగా పూరి గుర్తించాడు కాబట్టే దిశాని పిలిచి మరీ లోఫర్ కి జోడీగా ఛాన్సిచ్చాడు. దురదృష్టం కొద్దీ ఆ సినిమా ఫ్లాపవ్వడంతో టాలీవుడ్ని వదిలి పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైంది. అక్కడ మాత్రం కెరీర్ పరంగా డోఖా లేకుండా ముందుకు సాగిపోతోంది. భాఘి 2తో బంపర్ హిట్ కొట్టింది. అటుపై సల్మాన్ సరసన భరత్ చిత్రంలో నటిస్తున్న దిశా – మరిన్ని బారీ ప్రాజెక్టులకు సంతకాలు చేసేందుకు రెడీ అవుతోందిట.

ఈలోగానే దిశా ఏం ఆలోచించిందో కానీ ఇదిగో ఇలా ఉన్నట్టుండి తన చిట్టి చెల్లాయిని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు పరిచయం చేసింది. దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలని భావిస్తుందో ఏమో.. తొందర్లోనే చెల్లిని కూడా రంగుల ప్రపంచంలోకి తెచ్చేస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు యూత్. తాను కెరీర్ పరంగా పీక్స్ లో ఉండీ కత్రిన కైఫ్ లాంటి కథానాయిక చెల్లాయిని పరిచయం చేయడానికి చాలానే ఆలోచించింది. ప్రస్తుతం కత్రిన సిస్టర్ ఓ సినిమాలో నటిస్తోంది. అలానే దిశా కూడా నెమ్మది నెమ్మదిగా ఫేజ్ 3 వరల్డ్ లో తన గారాల చిట్టి చెల్లాయిని పాపులర్ చేసి స్టార్ ని చేయాలనుకుంటోందా?

అన్నట్టు అక్క పెద్ద స్టార్ కాబట్టి చెల్లాయి కూడా ఈ రంగంలోకి రావాలనుకుంటోందా? లేక స్వతహాగానే రాణించే దమ్ముందా? అన్నది చూడాలి. అయితే దిశాపటానీతో పోలిస్తే చెల్లెమ్మలో అంత గ్లో ఉన్నట్టు ఈ ఫోటోలో కనిపించడం లేదు. ఒకవేళ ఫోటోషూట్ల మాయాజాలంలో పడితే అన్ని రకాల గ్లోలు తిరిగొస్తాయేమో చూడాలి. మై బ్యూటిఫుల్ సిస్ అంటూ పరిచయం చేసింది కానీ పేరేంటో మాత్రం చెప్పలేదెందుకో! ఇంతకీ సిస్ కి ఏ లోఫర్ ఆఫర్ ఇస్తాడో?