శుభం కార్డు కావాలంటున్న లోఫర్ భామ

0dishaలోఫర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది నార్త్ బ్యూటీ దిశా పఠానీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో వెంటనే పెట్టెబేడా సర్దుకుని ముంబయికి మకాం మార్చేసింది. అప్పటి నుంచి అక్కడే ఉండి హిందీ సినిమాలు చేసుకుంటూ వస్తోంది. హాలీవుడ్ హీరో జాకీచాన్ తో కలిసి కుంగ్ ఫూ యోగా సినిమాలో నటించినా కోరుకున్న బ్రేక్ మాత్రం రాలేదు.

అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం అభ్యంతరం చెప్పే టైపు కాకపోవడంతో ఈ అమ్మడికి ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే ఈ భామకు ఓ కొత్త బెంగ పెట్టుకుంది. ఈమెకు వస్తున్నవన్నీ విషాదాంత పాత్రలేనట. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రల్లో ఎక్కువ ఇలాంటివే ఉన్నాయని చెబుతోంది. సినిమా అయిపోయేసరికి పైకెళ్లిపోయే పాత్రలు చేసిచేసి విసుగొచ్చేస్తోందని అంటోంది. ముందుముందు చేయబోయే సినిమాల్లో శుభం కార్డ్ పడేసరికి చక్కగా బతికుండే పాత్రలు చేయాలని దిశా పఠాని ఆశపడుతోంది. ఈ తరహా పాత్రలు ఏమైనా ఉంటే చూడమంటూ దర్శక నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తోంది.

దిశాపఠాని లో తన నటనతో కన్నా హీరో టైగర్ ష్రాఫ్ తో రిలేషన్ కు సంబంధించే న్యూస్ లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా అతడితో కలిసి బాఘీ-2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. టైగ్రర్ ష్రాఫ్ తో రిలేషన్ షిప్ పై ప్రశ్నించినా అతడు తనకు మంచి ఫ్రెండని.. అతడితో చాలా కంఫర్టబుల్ గా ఉండగలనని చెబుతోంది. రీల్ లైఫ్ హ్యాపీ ఎండింగ్ కావాలనే దిశా పఠాని కోరిక బాఘీ-2 తోనైనా తీరుతుందో లేదో చూద్దాం.