ఇలాగైతే కుర్రాళ్ల గుండెలు తలక్రిందులే

0దిశా పాట్నీ ఇప్పుడు బాలీవుడ్ లో చెలరేగిపోతోంది. ఇంకా అమ్మడికి స్టార్ హీరోల సరసన వరుసగా నటించే అవకాశాలు రావడం లేదు కానీ.. తాను ఆ స్థాయికి చేరుకుంటానని దిశ ఫుల్లు కాన్ఫిడెంటుగా ఉంది. టాలీవుడ్ లో లోఫర్ తర్వాత మళ్లీ ఇటువైపు చూడని దిశా పటాని .. హిందీ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా తన అందచందాలకు ట్యాలెంట్ ను మిక్స్ చేపించడంలో ఈమె బాగా దిట్ట. డ్యాన్సుల విషయంలో కుమ్మేసే ఈ భామ దగ్గర చాలానే విద్యలున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా జనాలకు చూపిస్తూ ఉంటుందంతే. రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన చిన్న వీడియో.. ఇప్పుడు వైరల్ అయిపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇందుకు కారణం.. అందులో అమ్మడు ధరించిన టూ పీస్ బికినీ మాత్రమే కాదు.. దాంతో అందాలను చూపించే కాన్సెప్ట్ కూడా ఆకట్టుకుంటుంది.

వైట్ కలర్ టూ పీస్ బికినీ వేసుకున్న ఈ భామ.. వీడియో మొదట్లో మనల్ని ఓసారి పలకరించి.. అంతలోనే నీటిలో మునక వేసేసి.. తలకిందులుగా ఫీట్ చేస్తుంది. సహజంగా స్విమ్మింగ్ పూల్ లో ఉన్నవారు పై అందాలను చూపిస్తారు. కానీ ఈ భామ మాత్రం పై భాగాన్ని నీటిలో ముంచి.. కాలి అందాలను నీటిపైకి తేల్చిందన్న మాట. కొత్త దిశలో దిశా పాట్నీ చూపించిన షోకులకు కుర్రాళ్ల గుండెలు కూడా తలకిందులు అయిపోతున్నాయి.