కొలతలన్నీ ప్యాక్ చేసింది

0


లోఫర్ బ్యూటీ దిశా పటానీకి ఫిట్నెస్ అంటే మహా మక్కువ. అసలు తన పేరు దిశా పటానీ కాదని.. దిశా పాట్నీ అని రీసెంట్ గా చెప్పిందీ భామ. అయితే.. జనాలు- మీడియా అంతా పటానీ అని పిలవడం మొదలుపెట్టడంతో అలాగే సరిపెట్టేసుకుంటున్నానని.. అయినా గుర్తింపు తనకు రావాలి కానీ.. పేరుకు కాదని ఓ టైపు వేదాంతం కూడా చెప్పింది. సోషల్ మీడియాలో తను కూడా పటానీ అనే రాసుకుంటోంది.

ఫిట్నెస్ కి మహా ఇంపార్టెన్స్ ఇచ్చే దిశా పటానీ.. ఇప్పుడు ఎఫ్ హెచ్ఎం మేగజైన్ మే నెల ఎడిషన్ కవర్ పేజ్ పై ఎక్కేసింది. అల్టిమేట్ ఫిట్నెస్ స్పెషల్ అంటూ రూపొందించిన ఈ ఎడిషన్ లో అందాల భామల ఫిట్నెస్ ని మెయిన్ థీమ్ గా తీసుకున్నారు. కవర్ పేజ్ పై కనిపించిన దిశ ఫోటో చూస్తే.. ఈమె ఏ రేంజ్ లో బాడీని మెయింటెయిన్ చేస్తుందో అర్ధమవుతుంది. నాభి షోకులను ప్రదర్శించడం పక్కన పెడితే.. నడుం కొలతలను కరెక్టుగా మెయింటెయిన్ చేస్తూ.. బాడీ మెలికలు తిప్పేయగల ట్యాలెంట్ ఈమె సొంతం.

అందాలన్నీ ప్యాక్ చేసినట్లుగా ఉండే దిశా పటానీ.. ఆ మధ్య కొన్ని ప్యాకులు కూడా చూపించింది కానీ.. ఇప్పుడు కాసింత మారిందిలే. అయితే.. ఈ ఫిట్నెస్ స్పెషల్ ఎడిషన్ లో దిశా పటానీతో మరో 24మంది తమ ఫిట్నెస్ ను ఎలా కాపాడుకుంటున్నారో డీటైల్డ్ గా ఫోటోలతో సహా వివరించారు.Disha-Patani-On-FHM-Magazine-Cover-Page