దిశా పటాని గ్లామరస్ క్యాట్ వాక్

0సాధారణంగా కొందరు హీరోయిన్స్ మోడల్స్ గా ఎంట్రీ ఇవ్వగానే సినిమా ఛాన్సులకు తెగ ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఆ ప్రయత్నాల్లో అప్పుడప్పుడు మంచి కంపెనీకి సంబందించిన యాడ్స్ వస్తే వెంటనే ఒకే చేస్తారు. అదే తరహాలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ దిశా పటని. 2015 లో వచ్చిన క్యాడ్బరి యాడ్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తెగ పాపులర్ అయ్యింది. దీంతో 2015 లో లోఫర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి మొదటి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయినా దిశా పటాని కి మాత్రం చాలా మంది ఫ్లాట్ అయ్యారనే చెప్పాలి. సాధారణంగా పూరి హీరోయిన్స్ ని గ్లామర్ గా చూపించడంలో కొత్తగా ట్రై చేస్తాడు. అదే తరహాలో దిశా కూడా గ్లామర్ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మూడు బాలీవుడ్ సినిమాల్లో కూడా ఛాన్సులను దక్కించుకుంది. అయితే రీసెంట్ గా ఈ అమ్మడు లాక్మి ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ తో తెగ హల్ చల్ చేసింది. ఈమె నడకను చూసినవారందరు కళ్ళార్పకుండా ఆమెకు తెగ ఆకర్షితులయ్యారట. ముఖ్యంగా ఆమె వేసిన డ్రెస్ కాస్త గ్లామర్ గానే ఉన్నా అందాలని మాత్రం ఘాటుగానే చూపించింది. దిశా లోఫర్ సినిమాలోకంటే ఇంకా అందంగా అయ్యిందని ఫొటోలు చుసిన నెటిజన్లు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

ప్రస్తుతం దిశా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆమె చివరగా జాకీచాన్ నటించిన కుంగ్ ఫు యోగా లో మాత్రమే మెరిసింది. ఇప్పుడు బాఘీ 2లో బాయ్ ఫ్రెండ్ తో చేస్తోంది. మరి రీసెంట్ గా ఇచ్చిన ఈ వాకులకు ఏ దర్శకుడైనా ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.disha-patani-ramp-walk