పని లేకపోయినా పబ్లిసిటీ

0Disha-Patani-Shares-Her-Picపూరీ జగన్నాధ్ లోఫర్ సినిమా ఆయన తీసిన కొన్ని ఫ్లాప్ సినిమాలలో గ్రేట్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. కాని ఈ సినిమా తో పరిచయమైన హీరోయిన్ మాత్రం.. మామూలు రచ్చ చేయదులే. ఆమెకు గ్లామర్ కు అంతటి పేరొచ్చింది. సెక్సీ బేబీ దిశా పటాని ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్లు కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్ యెస్ ధోని సినిమాలో మెరిసిన సుందరి తరువాత పెద్ద ప్రాజెక్టులు ఏమి లేక విహారాలు చేసుకుంటోంది.

సోషల్ మీడియాలో బాలీవుడ్ స్టార్లు బాగానే హల్ చల్ చేస్తారు. దిశా పటాని అటువంటి హీరోయిన్లలో ముందుంటుందని చెప్పవచ్చు. బికినీ లతో హాట్ ఫోటోలు పెట్టి కొద్ది రోజులు కిందట ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ తన మేని మెరుపులు చూపిస్తూ నన్ను సముధ్రం లోకి తీసుకువెళ్ళండి అని ఒక పిక్చర్ని పోస్ట్ చేసింది. చేతిలో ఏమి ప్రాజెక్టులు లేకపోయినా తన అందాలు ఆరబోస్తూ అభిమానులకు ఎప్పటికీ అప్పుడు తన ఉనికిని చెబుతూ వస్తోంది. హీరోయిన్ అన్నాక.. ఆ మాత్రం పబ్లిసిటీ ఉండాలి కదా. అదే మంత్రాన్ని తు.చ తప్పకుండా ఫాలో అవుతోంది దిశా.

తన ఫిట్ బోడి తో అదరగొడుతున్న అమ్మడు ఇప్పుడు తన బోయ్ ఫ్రెండ్ టైగర్ ష్రోఫ్ఫ్ నటిస్తున్న బాఘీ 2 లో జోడీ గా ఛాన్సు పట్టేసిందిలే. అందరి హీరో హీరోయిన్లులానే వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ అనే ముసుగులో డేటింగ్ చేస్తున్నారని టాక్. చాలాసార్లు ఇద్దరు కలిసి పట్టుపడినా అబ్బే మా మధ్య ఏమి లేదు అని చెబుతున్నారు ఈ యువ జంట.