ఎర్ర పెట్టెలో ఏం దాచావ్ చిచ్చూ?

0వైవిధ్యం చూపించకపోతే ఫ్యాషనిస్టా ఎలా కాగలరు? అప్పటికప్పుడు బికినీలో హీటెక్కించాలి. అప్పటికప్పుడే ట్రెడిషనల్ లుక్లో మతి చెడగొట్టాలి. జిమ్ డ్రెస్.. యోగా డ్రెస్.. డ్యాన్స్ వేర్ అంటూ కొత్త కొత్త ట్రెండ్స్ తో పిచ్చెక్కించాలి. ఇలాంటి అరుదైన విద్యల్లో రాటుదేలిన మేటి కథానాయిక ఎవరు? అంటే ఇదిగో `లోఫర్` బ్యూటీ దిశా పటానీని చూపించవచ్చు.

సందర్భాన్ని బట్టి రకరకాల రూపాల్లోకి ట్రాన్స్ ఫామ్ అవ్వడంలో ఈ అమ్మడిని కొట్టేవాళ్లే లేరు. బికినీలతో బీచ్ లను ఒణికిస్తుంది. జిమ్ చేస్తూ మంటలు పుట్టిస్తుంది. గుడికో – బడికో – లేదా పిజ్జా బర్గర్ షాప్ కో వెళితే అక్కడా ఓ డ్రెస్ కోడ్ ని మెయింటెయిన్ చేస్తూ దిశా పోయే హొయలు చూసి తీరాలి. ఇదిగో ముంబైలో ఇలా ఓ బర్గర్ షాప్ నుంచి వైట్ & వైట్ డిజైనర్ వేర్ లో సింపుల్ గా కనిపించింది. అరే అంత సింపుల్ బూటీ ఎంతందంగా ఉందో అనిపిస్తోంది. ఆ చిటికిన వేలికి చిక్కిన ఎర్రపెట్టెలో ఏం దాచిందో కానీ దానిని స్టైల్ గా తన వెంట తీసుకెళుతున్న తీరు మైమరిపిస్తోంది. విరబోసిన కురులు గాలికి కదిలినా ఎంతో అందంగా అలా సవరించుకుంటూ ఆహా అనిపించింది.

ముంబై వీధుల్లో ఈ దృశ్యాల్ని వీక్షించిన కుర్రకారు అంతే స్టన్నయిపోయి చూశారంతే. ఇకపోతే ఆ స్పాట్ లో టైగర్ భాయ్ వేచి చూస్తున్నాడో లేదో కానీ అలా అలా కదిలొస్తున్న ఈ హంపీ శిల్పాన్ని ఏ దూర తీరానికో ఎత్తుకెళ్లేవాడే! రీసెంటుగానే `భాఘి 2`లో జంటగా నటించారు. తదుపరి ఈ సిరీస్ లో పార్ట్ 3 ని ప్రకటిస్తారేమో చూడాలి. దిశా మరోవైపు భరత్ చిత్రంలో సల్మాన్ భాయ్ కి సోదరిగా నటిస్తోంది. మరిన్ని భారీ ప్రాజెక్టులు దిశా క్యూలో ఉన్నాయి.