అంతగా సంథింగ్ ఎంటో?!

0

కెల్విన్ క్లెయిన్ ప్రచారకర్త దిశా పటానీ స్పీడ్ గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో నిరంతరం అభిమానులకు సీకే ఫెస్టివల్ ట్రీట్ తో మతి చెడగొడుతోంది. మరోవైపు రకరకాల బ్రాండ్లకు ప్రచారకర్తగా బాగానే ఆర్జిస్తోంది. ఓవైపు టాప్ మోడల్ గా ఖరీదైన బ్రాండ్లను ఖాతాలో వేసుకుంటూనే.. కథానాయికగా క్రేజీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. కండల హీరో సల్మాన్ ఖాన్ `భారత్` చిత్రంలో దిశా అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతోందని ఇటీవలే రిలీజ్ చేసిన స్లోమోషన్ గీతం చెప్పకనే చెప్పింది.

ఈలోగానే యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ సరసన మోహిత్ సూరి దర్శకత్వంలో `మళంగ్` అనే చిత్రంలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా చిత్రీకరణ కోసం ప్రిపరేషన్స్ స్వింగ్ లోనే ఉన్నాయి. ఇప్పటికే మారిషస్ లో ఉంది చిత్రయూనిట్. మళంగ్ చిత్రంలో దిశా పాత్ర సంథింగ్ స్పెషల్. అందుకు తగ్గట్టే ముందే కాస్తంత స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోందిట. స్పాట్ నుంచి ఆదిత్య రాయ్ తో కలిసి ఉన్న ఫోటోని దిశా ఇన్ స్టాలో షేర్ చేసింది. “ట్రైనింగ్ ఫర్ సంథింగ్ స్పెషల్ # మళంగ్“ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫోటోలో సముద్రం గట్టున ఏదో సీరియస్ గానే రెక్కీ చేస్తోంది టీమ్. అక్కడ బ్లాక్ కలర్ స్పోర్ట్స్ డ్రెస్ లో కనిపిస్తోంది దిశా. అసలింతకీ అక్కడ ఏం శిక్షణ తీసుకుంటోందో .. ఏంటో ఆ స్పెషల్? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ఇక ఆదిత్య రాయ్ కపూర్ సైతం కండలు పెంచి 6-ప్యాక్ యాబ్స్ తో గాళ్స్ మతి చెడగొడుతున్నాడు. ఇంతకీ ఈ లుక్ ఏ సినిమా కోసం అంటే రొమాంటిక్ థ్రిల్లర్ `మళంగ్` కోసమేనని చెప్పాడు. ఇంకా 10-11 కేజీల బరువు పెరిగేందుకు వచ్చే నెలలో ప్రత్యేకించి వెయిట్ గెయిన్ ట్రీట్ మెంట్ కి వెళుతున్నాడట. మరోవైపు ఆషిఖి 2 తర్వాత మరోసారి మోహిత్ తో కలిసి పని చేయడంపైనా ఎంతో ఎగ్జయిట్ అవుతున్నాడు ఈ లవర్ బోయ్ కపూర్ బోయ్. గతంలోనూ ఫితూర్ అనే సినిమా కోసం ఆదిత్యారాయ్ కపూర్ ఇలాంటి భీకరమైన లుక్ తో కనిపించాడు. ఆన్ లొకేషన్ దిశా- కపూర్ ఫ్రెండ్షిప్ సంథింగ్ స్పెషల్ గానే ఉందని తాజా ఫోటో చెబుతోంది.
Please Read Disclaimer