సెన్సార్ సమస్యల్లో అల్లు అర్జున్ డీజే!

0Allu-Arjun-DJ-Movie-censor-issueఅల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం ఇటీవలే తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో బన్నీకి తెలుగు రాష్ట్రాల తర్వాత అంతగా ఫాలోయింగ్ ఉన్న కేరళలో సినిమాను విడుదలచేయాలని మలయాళ డబ్బింగ్ వెర్షన్ ను సిద్ధం చేశారు. ఇప్పటికే డబ్బింగ్ కు సంబందించిన అన్ని పనులు పూర్తైపోయాయి.

ముందుగా చిత్రాన్ని జూలై 14న రీలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పటికీ సినిమా విడుదలకాలేదు. అందుకు కారణం సెన్సార్ ఇంకా పూర్తికాకపోవడమేనని తెలుస్తోంది. ఆన్ లైన్ పద్దతి వలన సెన్సార్ ఆలస్యమవుతోందట. అందుకే చిత్ర విడుదల వాయిదాపడింది. ఈ ఆలస్యంతో టీమ్ కూడా ప్రమోషన్స్ ను వాయిదావేసుకుని సెన్సార్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తోంది. దిల్ రాజ్ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకి జోడీగా పూజ హెగ్డే నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.