దొరసాని ప్రీ లుక్ వచ్చిందోచ్

0

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా రాజశేఖర్.. జీవితల కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా పరిచయం అవుతోంది. కెవీ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోఈ సినిమాకు రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో నిర్మాతలు ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేశారు.

ఈ ప్రీ లుక్ పోస్టర్లో హీరోయిన్ తన చేతిని హీరో చేతికి అందిస్తున్నట్టుగా ఉంది. హీరోయిన్ చేతికి ఒక గాజు.. వేలికి పెద్ద ఉంగరం ఉన్నాయి. అదే హీరో చేతికి మాత్రం తెల్ల పెయింట్ మరకలు ఉన్నాయి. నేపథ్యంలో ఒక కాగితంపై రాసిన ప్రేమ కవిత ఉంది. కథవు నువ్వే.. కాలగమనంలో చెరిగిపోని ముత్యం నువ్వే” అంటూ ఒక పొడవాటి కవిత ఉంది.. అయితే ఈ కవిత సరిగా కనిపించడం లేదు. ఇక ఈ ప్రీ లుక్ పోస్టర్ లోనే ఫస్ట్ లుక్ ను మే 30 వ తారీఖున విడుదల చేస్తామని ప్రకటించారు.

మథుర శ్రీధర్ రెడ్డి.. యష్ రంగినేని ఈ చిత్రాన్ని మథుర ఎంటర్టైన్మెంట్స్.. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా ఈ సినిమాకు భాగస్వాములు కావడం గమనార్హం. మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ.. శివాత్మికల డెబ్యూ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Please Read Disclaimer