చరణ్ డబుల్ బొనంజా

0


double bonanja from charanమెగా అభిమానులకు ఓ డబుల్ బొనంజా… రామ్ చరణ్-కృష్ణ వంశీ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేంగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రం టైటిల్ ను కూడా అదే రోజున ప్రకటిస్తారట.  

ఈ చిత్రానికి ‘గోవిందుడు అంద‌రివాడేలే’ అనే టైటిల్ పెట్టారని వార్తలొచ్చాయి. అయితే,  సినిమా టైటిల్ అది కాదంటూ చిత్ర బృందం ప్రక‌టించింది. ఇందుకోసం ఓ క్లాసిక్ టైటిల్ ను కృష్ణ వంశి ఇప్పటికే  ఫైనల్ చేశారట. చరణ్ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్, టైటిల్ ఒకే సారి విడుదల చేస్తున్నారు. కుటుంబ అనుబంధాల నేప‌థ్యంలో సాగే చిత్రమిది.