మణికర్ణిక వసూళ్లు కష్టమేనా?

0



చారిత్రాత్మక కథలపై ప్రస్తుత జనరేషన్ దర్శకులు ఇంట్రెస్ట్ బాగానే చూపిస్తున్నారు గాని ఎవరు ఊహించినంతగా మెప్పించడం లేదు. వార్ డ్రామా సినిమాలు బాహుబలి రేంజ్ లో వసూళ్లను అందుకోవడం లేదు. హిట్ అవుతున్నాయి గాని కలెక్షన్స్ పరంగా సినిమాలు బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవడం లేదు. ఇకపోతే ప్రస్తుతం తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమా పై అనుమానాలు చాలానే పెరుగుతున్నాయి.

వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత ఆధారంగా ఆ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ఆ కథను తన స్టైల్ లో ప్రజెంట్ చేయడానికి బాగానే కష్టపడుతున్నాడు. సినిమా కోసం దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేయించాడు. నిర్మాతల నుంచి దర్శకుడికి చాలా వరకు ఫ్రీడమ్ దొరికింది. అయితే సినిమాలో ఝాన్సీ లక్ష్మీ బాయ్ పాత్రలో కంగన రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె గత సినిమాల రిజల్ట్ చూసుకుంటే దారుణంగా నష్టాలను మిగిల్చాయి.

సిమ్రాన్ అనే సినిమా కోసం 40 కోట్ల వరకు ఖర్చు చేయగా ఆ సినిమా కనీసం బడ్జెట్ లో సగం వసూళ్లను కూడా రాబట్టలేదు. దీంతో ఆ మార్కెట్ ఎఫెక్ట్ మణికర్ణిక పై ఎఫెక్ట్ చూపేలా ఉందనే కొన్ని రూమర్స్ వస్తున్నాయి. పైగా పెద్ద స్టార్స్ కూడా సినిమాలో లేరు. కథలో ఎంత బలం ఉన్నా కూడా కంగన అనుకున్నంత రేంజ్ లో వసూళ్లను రాబడుతుందా అనేది సందేహంగా మారింది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.