డ్రగ్స్ రాకెట్: నైజీరియన్లతోపాటు బెజవాడ అమ్మాయి అరెస్ట్

0drugs-racketఇప్పటికే డ్రగ్స్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. నేరెడ్‌మెట్‌‌లో ఐదుగురు సభ్యులు ఈ ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఈ ముఠాలో నైజీరియన్లతోపాటు విజయవాడకు చెందిన ఓ అమ్మాయికి కూడా ఉండటం గమనార్హం. ఈ ముఠాలోని ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్న సదరు యువతి.. వారితో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.

ఈ ముఠా నుంచి భారీగా డ్రగ్స్‌తోపాటు రూ.2.5లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో సభ్యుడైన నైజీరియన్ వెల్ఫేరేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వీరి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో వివిధ రకాలున్నాయని తెలిసింది.

సరైన పత్రాలు లేకుండా మన దేశానికి వచ్చిన నైజీరియన్ యువత.. నగర శివార్లలో మకాం వేసుకుని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గోవా, ముంబై నుంచి డ్రగ్స్ నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ డ్రగ్స్ ముఠాను సోమవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.