మంచు మనోజ్ ని మెప్పించిన వైరల్ వీడియో!

0పావ్లోవ్ అనే పెద్దాయన ‘సైకలాజికల్ కండిషనింగ్’ మీద ‘కుక్క – గంట’ ఎనే ఫేమస్ ఎక్స్ పరిమెంట్ చేశాడు. దాదాపు ఇది అందరికీ తెలిసే ఉంటుంది. రోజు ఒక టైమ్ లో కుక్కకు తిండి పెట్టేవాడు. దానికి ముందుగా గంట మొగించేవాడు. తిండి చూస్తే నోట్లో లాలాజలం ఊరుతుంది కదా.. కుక్కకేం ఖర్మ.. మనక్కూడా ఊరుతుంది. అలా దానికి తిండి చూడగానే రోజూ నోట్లో సెలైవా ఊరేది.. ఒకరోజు తిండి పెట్టకుండా కేవలం గంటనే మోగించాడు. కానీ కుక్కకు లాలాజలం ఊరింది. అదే కండిషన్ డ్ రిఫ్లెక్స్.

సైకాలజీ పేరుతో కుక్క- గంట లాంటి చెత్త ఎగ్జాంపుల్స్ చెప్పి గురువారం పూట – అదీ మహేష్ బాబు పుట్టిన రోజు మాకేంటీ సోది అనుకోవద్దు. ఈ కండిషన్డ్ రిఫ్లెక్స్ కి పావ్లోవ్ కి పాపం పెద్ద ఎక్స్ పరిమేంట్ చేయవలసి వచ్చింది గానీ ఇప్పుడు అలాంటివి అవసరం లేదు. రోజూ బ్రీథ్ అనలైజర్ మందుబాబుల మూతి దగ్గర పెట్టి ఉఫ్ఫని ఊదమంటారు కదా మన పోలీసులు.. అలా రోజూ చేస్తే ఆ తర్వాత మందు బాబు మూతి తగ్గర ఏ పుల్ల లేదా కర్ర లేదా మైకు పెట్టినా ఉఫ్ఫని ఊదుతాడు. ఏం.. నమ్మరా?

హీరో మంచు మనోజ్ ఓ వైరల్ వీడియో ను(అది పాతదే.. సోషల్ మీడియా లో బాగా సర్క్యులేట్ అయిన వీడియోనే) ట్విట్టర్ లో షేర్ చేసి “మీరు ఎక్కువ సార్లు డ్రంక్ & డ్రైవ్ లో పట్టుబడితే ఇలానే ఉంటుంది అని ట్వీట్ పెట్టాడు.” ఇంతకీ విడియో లో ఏముందంటే.. సినిమా రిలీజ్ అయిన రోజు మొదటి షో చూసి బయటకు వచ్చే ప్రేక్షకుల మూతి దగ్గర మైకు పెట్టి ‘ఎలా ఉంది.. ఎలా ఉంది.. ఎలా ఉంది’ అని అడుగుతారు కదా. అలా ఒకరి మూతి దగ్గర మైకు పెడితే.. ఆ ప్రబుద్దుడు మైకుని చూసి బ్రెత్ అనలైజరు అనుకోని ఉఫ్ఫని ఊదాడు. పాపం పావ్లోవ్ కి ఈ సంగతి తెలీక పెద్ద ఎక్స్ పరిమెంట్ చేశాడు. ప్చ్!