డ్రంకన్ డ్రైవ్‌: తాగి గోల చేసిన మరో అమ్మాయి

0హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. స్నేహితునితో కలిసి ఆ యువతి ప్రయాణిస్తున్న కారును ట్రాఫిక్ పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్‌ చేస్తున్న యువతి స్నేహితుడు మద్యం సేవించినట్లు నిర్ధారణ అయి పట్టుపడ్డాడు.

పక్క సీట్లో ఉన్న ఆ యువతి ఒక్కసారిగా కారు నుంచి బయటకు వచ్చి … డ్రంకన్‌ డ్రైవ్‌ను చిత్రీకరిస్తున్న మీడియాపై రాళ్లతో దాడికి దిగింది. పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించింది. మహిళా కానిస్టేబుల్ సహాయంతో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో 103 బైక్‌లు, 46 కార్లు, 2 ఆటోలను సీజ్ చేశారు. ఇదే డ్రైవ్ లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 151 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.