ఆ హీరోయిన్ తో దేవిశ్రీ ఎఫైర్ నిజమా..?

0DSP-Dating-Pranithaసంగీత దర్శకులపై పుకార్లు రేగడం అరుదైన విషయమే. అయితే.. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఈ విషయంలో హీరోల్నే మించిపోయాడు. దేవిపై హాట్ హాట్ పుకార్లకు కొదవ లేదు. ఛార్మి , డీఎస్పీలను లింకప్ చేస్తూ ఎన్ని హాట్ న్యూసులు పుట్టాయో..? ఇప్పుడు మరో కథానాయికతో దేవిశ్రీ చాటుమాటు వ్యవహారం నడుపుతున్నాడన్న రూమర్లు బయల్దేరాయి.

ఆ కథానాయిక ఎవరో కాదు.. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాన్ కు మరదలుగా కనిపించిన ప్రణీత. ఈ అమ్మడు ఆ తరవాత అంతగా జోరు చూపించలేకపోయింది. అయితే.. దేవిశ్రీని కొంగుకు కట్టేసుకొని తిప్పేస్తోందని టాక్. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తెగ తిరిగేస్తున్నారని, వ్యవహారం రోజురోజుకీ ముదురుతోందని చెప్పుకొంటున్నారు.

అయితే వీళ్లిద్దరూ మాత్రం నోరు మెదపడం లేదు. ఇంకేం… దేవిశ్రీ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కదా? హీరోయిన్ కోసం పెద్దగా వెదుక్కొనే శ్రమ లేకుండా పోయింది.