రకుల్ విలన్ అయ్యిందా?

0టాలీవుడ్ లో మొన్నటి వరకు అగ్ర కథానాయికగా కొనసాగిన రకుల్ ప్రీత్ ప్రస్తుతం పరభాష సినిమాలపై కాస్త మక్కువ ఎక్కువగానే చూపిస్తోంది. పక్క ఇండస్ట్రీలో అమ్మడికి ఆఫర్స్ బాగానే అందుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో రకుల్ గ్లామర్ గురించి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే అమ్మడు బ్యాడ్ లక్ ఏమిటో గాని ఓ చిన్న ట్వీట్ వాళ్ల ఇటీవల మలయాళం హీరో ఫ్యాన్స్ కు విలన్ అయ్యింది.

రకుల్ ప్రీత్ తెలుగు సినిమాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటుంది. కొత్త సినిమాకు హిట్ టాక్ వచ్చింది అంటే చాలు స్పెషల్ షో వేసుకొని మరి చూసేస్తుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా మహానటి సినిమా చూసిన రకుల్ వెంటనే ఒక ట్వీట్ చేసింది. సినిమా తనకు బాగా నచ్చిందని ఇటీవల కాలంలో చుసిన ది బెస్ట్ సినిమా అని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యిందని ట్వీట్ చేసింది. అలాగే నటీనటులు కీర్తి సురేష్ సమంత విజయ్ దేవరకొండ అందరు చాలా బాగా చేశారని చెప్పింది.

ఇక సినిమాలో కీలక పాత్ర పోషించిన దుల్కర్ సల్మాన్ పేరును మాత్రం అమ్మడు మెన్షన్ చేయకపోవడం వివాదస్పదంగా మారింది. మలయాళం యువ హీరో పేరు అంటే అంత లెక్కలేదా అంటూ దుల్కర్ అభిమానులు రకుల్ పై విమర్శల బాణాలను వదులుతున్నారు. అయితే మరికొందరు మాత్రం రకుల్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ రావడం సెలబ్రెటీలకు అలవాటే.. అని రకుల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరికొంత మంది చెబుతున్నారు.