రెండోవారంలో భారీగా తగ్గిన డీజే కలెక్షన్స్

0dj-duvvada-jagannadham-movie-reviewతొలి వారంలో దుమ్ము దులిపేసిన `డీజే.. దువ్వాడ జగన్నాథమ్` రెండో వారంలోకి వచ్చేసరికి చతికిలబడిపోయాడు. ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయేలా సినిమా వసూళ్లు పడిపోయాయి. అసలు తొలి వారానికీ – రెండో వీకెండ్ కీ మధ్య పొంతనే లేకుండా వసూళ్లు పడిపోవడం చిత్రబృందాన్ని సైతం షాకింగ్ కి గురిచేసింది. నిజానికి సినిమా మిక్స్ డ్ టాక్ తోనే విడుదలైంది. తొలి రెండు షోలు చూసిన చాలా మంది పెదవి విరిచారు. దాదాపుగా రివ్యూలు కూడా నెగెటివ్ గానే వచ్చాయి. కానీ సినిమాలో వినోదం – బన్నీ నటన – పూజ గ్లామర్ నచ్చడంతో మాస్ అభిమానులు సినిమాని బాగా చూశారు. దాంతో సాయంత్రానికంతా మిక్స్డ్ టాక్ వెళ్లిపోయి – హిట్టు టాక్ వచ్చేసింది. రికార్డు స్థాయిలో వసూళ్లొచ్చాయి. తొలి వారం వసూళ్లు చూశాక సినిమా నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలుస్తుందని అల్లు అర్జున్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్టుగా నిలుస్తుందని ఊహించారు. అంత బలమైన టాక్ తో రెండో వారంలోకి అడుగుపెట్టిన సినిమా ఆ తర్వాత మాత్రం బాక్సాఫీసుపై ప్రభావం చూపించలేకపోయింది. తొలి వారంలో 61కోట్ల షేర్ ని – 92 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్న డీజే – రెండో వీకెండ్ ని కేవలం 10 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకొంది. 5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. రెండో వారం వసూళ్లు చూసిన ట్రేడ్ పండితులు డీజే యావరేజ్ గ్రాసర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమా బ్రేక్ ఈవెన్గా నిలవాలంటే మరో 14 కోట్లు వసూలు చేయాలనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. సినిమాకి రిపీట్ ఆడియెన్స్ లేకపోవడంతోనే వసూళ్లు ఇంతగా పడిపోయాయని అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్ డీజే గత పది రోజుల్లో సాధించిన వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…

నైజామ్: 19.18కోట్లు

సీడెడ్: 9.29 కోట్లు

ఉత్తరాంధ్ర: 6.83కోట్లు

గుంటూరు: 5.09కోట్లు

కృష్ణ: 3.77కోట్లు

ఈస్ట్: 4.39కోట్లు

వెస్ట్: 3.75కోట్లు

నెల్లూరు: 2.35కోట్లు

డీజే పది రోజుల్లో ఆంధ్ర – నైజామ్ ప్రాంతాల్లో చేసిన మొత్తం వసూళ్లు: 54.65 కోట్లు కాగా – ప్రపంచవ్యాప్తంగా కలుపుకొంటే రూ: 66.15కోట్లు అవుతుంది. ( అమెరికాలో రూ: 3.06 కోట్లు – కర్ణాటకలో రూ: 6.36కోట్లు – రెస్టాఫ్ ఇండియా రూ: 0.94 – రెస్టాఫ్ వరల్డ్ రూ: 1.15కోట్లు వసూలు చేసింది)