ట్రైలర్ సరికొత్త రికార్డు: బాహుబలి తర్వాత డిజేనే..

0Duvvada-jagannadham-trailerస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెడ్గే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన దువ్వాడ జగన్నాధమ్(డిజె) ట్రైలర్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 7.4 మిలియన్ వ్యూస్ సాధించింది. యూట్యూబ్, ఫేస్ బుక్‌లో కలిసి ఇంత భారీ రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తర్వాత అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా సౌతిండియా రికార్డ్ నమోదు చేసింది.

ట్రైలర్ విషయంలో ఇంత రెస్పాన్స్ రావడం, సినిమాపై అంచనాలు మరింత పెరగడంతో బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

డిజె చిత్రాన్ని జూన్ 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై ఇటీవల ఓ వివాదం తెరపైకి రాగా…. దాన్ని క్లియర్ చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు హరీష్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. గబ్బర్ సింగ్ తర్వాత ఆయన మల్లీ ఆ రేంజి హిట్ కొట్టలేదు. ఈ సినిమాతో మళ్లీ తన సత్తా ఏమిటో నిరూపించుకుంటాననే కసితో ఈ సినిమా చేసారు.

ఇక హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో అందుకు తగిన విధంగానే సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.