యానిమేటెడ్‌ కామెడీ చిత్రం ‘ఎర్లీ మ్యాన్‌’

0యానిమేటెడ్‌ సినిమాలను ఇష్టపడేవారు సిద్ధంగా ఉండండి. త్వరలోనే ఓ సినిమా మిమ్మల్ని అలరించేందుకు రాబోతోంది. నిక్‌ పార్క్‌ దర్శకత్వంలో తెరకెక్కిన స్టాప్‌-మోషన్‌ యానిమేటెడ్‌ కామెడీ చిత్రం ‘ఎర్లీ మ్యాన్‌’. 2015లో ‘షాన్‌ ద షీప్‌’ మూవీ చిత్రాన్ని నిర్మించిన నిక్‌ ఇప్పుడు ‘ఎర్లీమ్యాన్‌’కు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. రాతి యుగానికి చెందిన ఓ గ్రామాన్ని కాంస్యయుగానికి చెందిన వారు ఆక్రమించుకోవడంతో ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఏం చేశాడు? తన గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడు? అన్నదే ఈ చిత్ర కథ. ఆద్యంతం ఆకట్టుకునేలా, నవ్వులు పంచేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. 50 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తాజా చిత్రాన్ని తెరకెక్కించారు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.