య్యూటూబ్‌లో దుమ్మురేపుతున్న‌ ఎడ్ షీర‌న్ సాంగ్‌

0ఇంగ్లీష్ సాంగ్ రైట‌ర్ ఎడ్ షీర‌న్ రాసిన షేప్ ఆఫ్ యూ సాంగ్ దుమ్మురేపుతున్న‌ది. ప్ర‌పంచ వ్యాప్తంగా మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఆ పాట‌కు ఉర్రూత‌లూగుతున్నారు. మారింబా బీట్స్‌కు యువ‌త థ్రిల్‌లో తేలిపోతున్న‌ది. విడుద‌లైన రెండు నెల‌ల్లోనే యూట్యూబ్‌లో ఆ పాట‌కు సుమారు 50 కోట్ల వ్యూవ్‌లు వ‌చ్చాయి. అయితే ఆ ఎడ్ షీర‌న్ పాట‌ను ఇప్పుడు సంగీత ప్రేమికులు త‌మదైన స్ట‌యిల్‌లో అనుక‌రిస్తున్నారు. వైర‌ల్‌గా మారిన షేప్ ఆఫ్ యూ సాంగ్‌ను డాన్స్ స్టూడెంట్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రూర్కెలా ఐఐటీకి చెందిన విద్యార్థులు ఆ సాంగ్‌తో ఓ వీడియోను రూపొందించారు. ఇప్పుడు ఆ వీడియో కూడా వైర‌ల్‌గా మారింది.

మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా ఎడ్ షీర‌న్ సాంగ్‌కు డాన్స్ చేశారు. వాళ్ల డాన్స్ కూడా ఇంట‌ర్నెట్‌లో సంచ‌ల‌నంగా మారింది.

ఒడిశా టూరిజం శాఖ కూడా షేప్ ఆఫ్ యూ సాంగ్‌ను త‌మ‌కు అనుకూలంగా వాడుకుంది.

ఒక అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా కూడా షేప్ ఆఫ్ యూ సాంగ్‌తో కేక పుట్టిస్తున్నారు.

మీరు అసలు సాంగ్ చూశారా. ఇదే ఆ ఒరిజినల్ సాంగ్. ఆ కిక్ ను ఫీల్ కావాలి మరి. ఇది అఫిషియల్ లిరిక్.

ఇది అఫిషియల్ వీడియో సాంగ్.