అరవింద తర్వాత కన్నడలో భలే ఆఫర్

0

Eesha-Rebba-bags-oFfer-in-Kannadaతెలుగు బ్యూటీ ఈషా రెబ్బా హీరోయిన్ గా తన సత్తా చాటుకున్నా టాలీవుడ్లో మాత్రం ఇంకా టాప్ లీగ్ కు చేరలేదు. తన కెరీర్లో మొదటిసారి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో నటిస్తోంది. ‘అరవింద సమేత’ కనుక హిట్ అయితే తన కెరీర్ టేకాఫ్ అవుతుందని నమ్మకంగా ఉంది. ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హెరోయిన్ కాబట్టి రిలీజ్ అయిన తర్వాత గానీ ఈషా పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనం చెప్పలేం.

ఇదిలా ఉంటే.. ‘అరవింద సమేత’ రిలీజ్ కాక మునుపే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తాజా చిత్రం ‘SRK’ లో హీరోయిన్ గా అవకాశం వచ్చిందట. ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. శాండల్ వుడ్ లో టాప్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ సినిమాలో ఛాన్స్ అంటే ఈషాకు జాక్ పాట్ తగిలినట్టే. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ డాన్స్ ట్రైనర్ పాత్ర పోషిస్తాడట. హీరోయిన్ ఈషా ఒక లెక్చరర్ పాత్రలో కనిపిస్తుందట.

లక్కీ గోపాల్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తాడని కిరణ్ కుమార్ గౌడ ఈ సినిమాకు నిర్మాత. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు స్టంట్ మాస్టర్.. ఇతర డిపార్ట్మెంట్స్ లోకూడా సీనియర్ టెక్నిషియన్స్ పనిచేస్తారట.
Please Read Disclaimer