‘నో’ ఇండిగో అంటోన్న టాలీవుడ్ నటి!

0కొంతకాలంగా ఇండిగో విమాన సిబ్బంది పేరు వార్తల్లో మార్మోగిపోతోన్న సంగతి తెలిసిందే. ఒకటి రెండు సందర్భాల్లో …ఇండిగో సిబ్బందితో కొంతమంది సెలబ్రిటీలు దురుసుగా ప్రవర్తించారని వార్తలు వచ్చినా….అధిక సందర్భాల్లో మాత్రం ఇండిగో సిబ్బందిదే తప్పని ఆరోపణలు వచ్చాయి. తమతో ఇండిగో సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని….అందువల్లే వారితో గొడవపడాల్సి వచ్చిందని పలువురు గతంలో ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఇండిగో సిబ్బందిపై టాలీవుడ్ నటి ఈషా రెబ్బా సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇండిగో సిబ్బంది…తనతో దురుసుగా అమర్యాదగా ప్రవర్తించారని ఇకపై ఆ సంస్థకు చెందిన విమానాలను ఎక్కడం మానేయాలని ఈషా పిలుపునిచ్చింది.

ఇండిగో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తాను విమానం మిస్ అయ్యానంటూ ఈషా ఫ్యాన్ ఒకరు ట్వీట్ చేశారు. ఇండిగో ఉద్యోగుల పొగరు కారణంగా తాను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు ఫ్లయిట్ మిస్సయ్యానని చెప్పాడు. ఒక నిమిషం ఆగండి…. 10 నిమిషాలు ఆగండి అంటూ తనను వారు వెయిట్ చేయించారని అన్నాడు. చేసిందంతా చేసి చివరికి తానే 5 నిమిషాలు లేట్ గా వచ్చానని దబాయించారని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై ఈషా రెబ్బా స్పందించింది. తాను కూడా గతంలో ఇండిగో కారణంగా ఇలాంటి సమస్యనే ఎదుర్కున్నానని ఇకపై తాను ఇండిగోలో ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పింది. ఇండిగో విమానాల్లో ఎప్పుడూ ప్రయాణించవద్దని ఇండిగోకు దూరంగా ఉండాలని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈషా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.