కత్తిలా రెడీ అయిన బ్యూటీ

0

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోలు మాత్రమే ఉన్నారు. తెలుగు హీరోయిన్లు లేరు అని అనుకునేవారికి కాస్త ఊరట కలిగించేందుకు కనీసం ఈషా రెబ్బాలాంటి టాలెంటెడ్ తెలుగమ్మాయిలు ఉన్నారు. ఇంకా ఎ-లిస్టు హీరోయిన్లలోకి చేరకపోయినా నిరాశచెందకుండా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈషా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసింది. చక్కగా రెడీ అయ్యి “హాయ్ గయ్స్.. మీకు మీకుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దీపావళి. స్టే సేఫ్ అండ్ హ్యావ్ ఫన్” అంటూ చెప్పింది. జస్ట్ చెప్పడమేనా మీరు సరిగా గమనిస్తే అటు ఇటూ అందంగా మల్లెతీగలా కదులుతూ చిరునవ్వుతో చెప్పింది. ఇక ఈ వీడియోతో పాటుగా సేమ్ డ్రెస్ లో ఉన్న మరో ఫోటోను కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఆ చీర.. హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. అబ్బో అబ్బబ్బో.. బాపు బొమ్మలా ఉందంటే నమ్మండి. ఎవరండీ తెలుగమ్మాయిలు అందంగా ఉండరు. హాట్ గా ఉండరు అనేది.. ఈషా ను ఈ ఫోటోను చూపించండి.. చచ్చినట్టు లెంపలేసుకుంటారు!
Please Read Disclaimer