అరవింద లో నేను రెబెల్ అంటున్న రెబ్బా!

0ఈషా రెబ్బా. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు ప్రాధాన్యత దక్కడం లేదు.. అసలు అవకాశాలే ఇవ్వడం లేదు.. ఎక్కువ మాట్లాడితే ‘క్యాస్టింగ్ కౌచ్’ అంటూ టాలీవుడ్ కోలీవుడ్ తాట తీస్తున్న ఈ తెలుగు భామల మధ్యలో తన పని తాను చేసుకుంటూ.. మెల్లగా స్టార్డం వైపు సాగుతున్న అచ్చ తెలుగు భామ. సరైన దృక్పథం కష్టపడే తత్త్వం ఉంటే.. ఎవ్వరినీ ఆ బ్రహ్మదేవుడే దిగివచ్చినా ఆపలేరంటూ ప్రూవ్ చేస్తున్న ‘టెల్గు బ్యూటీ’.

కొన్ని హిట్ సినిమాలలో నటించిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో అవకాశం సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే కదా.. మరి ఈషా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని అనుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో కాసేపు మాత్రమే కనిపిస్తుందని అన్నారు కూడా.

ఇవన్నీ ఈషా దాక వెళ్ళాయేమో.. తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చింది. “నేను అరవింద సమేత లో సెకండ్ లీడ్. అంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోయే క్యారెక్టర్ కాదు. ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే వచ్చే పాత్ర కూడా కాదు. సినిమా అంతా నేనుంటాను. చాలాచోట్ల ఎన్టీఆర్ పక్కనే ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సినిమాలో తన క్యారెక్టర్ రెబెల్ అంటోంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్నా తను మాత్రం హైదరాబాద్ అమ్మాయిగా కనిపిస్తానని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ తో డ్యాన్సులు కూడా ఉన్నాయని మురిసిపోతోంది. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్స్ లీగ్ లో ఎంటర్ అవుతానని ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలుగు అమ్మాయి కాబట్టి మనం కూడా ఫుల్లుగా సపోర్ట్ చేద్దాం.. వి ఆర్ విత్ యూ ఈషా..!