అవన్నీ ‘లైట్’ అంటున్న ఈషా రెబ్బా!

0గ్లామర్ ఫీల్డ్ అన్నాక రూమర్లు సహజమే.. గాసిప్పులు సహజమే. వాటిల్లో కొన్ని నిజాలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. నిప్పు లేందే పొగ రాదని మన తెలుగులో ఒక సామెత కూడా ఉంది. కానీ అచ్చ తెలుగు టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా మాత్రం అవన్నీ ‘లైట్’ అంటోంది.

ఈషా తాజా చిత్రం ‘బ్రాండ్ బాబు’ ఆగష్టు 3 న విడుదల కానుంది. మారుతి కథ సమకూర్చిన ఈ సినిమాలో కొత్త హీరోకు జంటగా నటిస్తోంది ఈషా. ఈ సినిమాలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియా తో మాట్లాడుతూ తనపై చాలా వింత రూమర్లు వస్తున్నాయని.. దాంతో వాటిని తేలిగ్గా తీసుకోవడం మొదలుపెట్టానని చెప్పింది. నిజమే.. ఒకవేళా సీరియస్ గా తీసుకుంటే వాటికి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఇస్తూ పొతే పూట కొక కొత్త రూమర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎంతైనా తెలుగమ్మాయి కదా.. ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే టాలీవుడ్ లో హీరోయిన్ ఎలా అవుతుంది?

ఈషా ‘బ్రాండ్ బాబు’ కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో టాప్ లీగ్ లో కి వెళ్తానని నమ్మకంగా ఉంది.