అరవింద సోదరి ప్రేమ కథ!

0

నిన్న అరవింద సమేత వీర రాఘవ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి యంగ్ టైగర్ ఫాన్స్ దాని తాలూకు ముచ్చట్లలో యమా బిజీ అయిపోయారు. సినిమా మీద అంచనాలతో ఎలా ఉండబోతోందో అన్న ఉత్సుకత వాళ్లలో పెరుగుతోంది. అభిమానులు కాబట్టి ఆ మాత్రం ఆసక్తి ఉండటం సహజం. 2 నిమిషాల ట్రైలర్ లో కథకు సంబంధించి కొన్ని క్లూస్ ఇచ్చిన త్రివిక్రమ్ దాని బిగినింగ్ లోనే పూజ హెగ్డే లవ్ ట్రాక్ తో మొదలు పెట్టాడు. కానీ మరో హీరోయిన్ గా నటించిన ఈషా రెబ్బా పాత్ర గురించి ఇంతకు ముందు ఏ సమాచారం లేదు.

కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ లో ఈషా ఉంటుందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ మాటల మాంత్రికుడు వాటికి చెక్ పెడుతూ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో ట్రైలర్ లో చూపించేసారు. సో ఈషా రెబ్బకు సెపరేట్ ట్రాక్ కానీ సాంగ్ కానీ లేదని తేలిపోయింది. అఫ్ కోర్స్ టైటిల్ లో సగం ఉన్న అరవింద పాత్రకే రెండు పాటలే ఉన్నప్పుడు ఈషాకు అసలు లేకపోవడంలో ఆశ్చర్యం లేదు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో పూజా హెగ్డే ఈషా రెబ్బ ఇద్దరు అక్కా చెల్లెళ్లుగా కనిపిస్తారట. సహజంగానే వీర రాఘవ రెడ్డి అరవింద మీద మనసు పారేసుకోవడం ఈషా మాత్రం రాఘవను ప్రేమించడం లాంటి చిన్న చిన్న మలుపులతో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మంచి ఎంటర్ టైనింగ్ గా ఉంటుందట. శ్రీనివాస రెడ్డి కామెడీతో సరదాగా గడిచిపోయేలా రాసుకున్నారట. మరి ఈషా ప్రేమను వ్యక్తపరిచే సీన్ ఉంటుందా లేక పూజా ప్రేమను తెలుసుకుని సైలెంట్ గా సైడ్ అయిపోతుందా వేచి చూడాలి.

ఈషా రెడ్డి స్టార్ హీరో సినిమాలో చేయటం ఇదే మొదటిసారి. అమీ తుమీ-అ!! లాంటి చెప్పుకోగ్గ సక్సెస్ లు తన కెరీర్ లో ఉన్నా అవన్నీ చిన్న హీరోలతో నటించినవి. అందుకే ఇది కనక పెద్ద హిట్ అయితే తన కెరీర్ కూడా బూస్ట్ అవుతుందని చాలా అంచనాలు పెట్టుకుంది ఈషా. ఈ మధ్యే వచ్చిన బ్రాండ్ బాబు తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ తనకు చాలా కీలకం.
Please Read Disclaimer