గేటు దగ్గర అర్థగంట ఆపేశారు!

0

తెలుగమ్మాయి ఈషా రెబ్బా అరవింద సమేతలో నటించిన సంగతి తెలిసిందే. ఈష పాత్ర ఈ చిత్రంలో ఎంతో ఇంపార్టెంట్ అని ఇదివరకూ ప్రచారమైంది. ట్రైలర్ లోనూ తారక్ కి ఎంతో సన్నిహిత పాత్ర ఈష చేసిందని అర్థమైంది. ఇక ఎన్టీఆర్ కి వీరాభిమానిగా ఈ చిత్రంలో నటించానని ఈష అరవింద సమేత వేదికపై తెలపడం సర్ ప్రైజ్.

నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వగానే .. తారక్ అభిమానులంతా సంతోషించారు. అది నా అదృష్టం.. అని అంది ఈష. ఒక తెలుగమ్మాయికి త్రివిక్రమ్ గారు అవకాశం ఇచ్చారు. అందుకే ఫ్యాన్స్ అంతా సంతోషించారు. మీ అందరిలానే నేను జూ.ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ ని. మీ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. అయితే నోవాటెల్ వచ్చేప్పుడు గేటు ముందే అరగంట ఆపేశారు.. అంటూ ఫ్యాన్స్ ని ఉద్ధేశించి అంది ఈష. తనకు అవకాశం ఇచ్చిన నిర్మాత రాధాకృష్ణ గారికి థాంక్స్ అని చెప్పింది.

అన్నట్టు .. ఈష అరవింద సమేతకు ముందు వేరు.. తర్వాత వేరు అంటూ యాంకర్ సుమ బిస్కెట్ వేసేసింది. త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు కాబట్టి ఈష అలా మాట్లాడుతూనే ఉంది… మాట్లాడుతూనే ఉంటుంది అంటూ పొగిడేసింది. మొత్తానికి మాటల మాయావితో కలిసి పనిచేస్తే మాటలు నేర్చుకోవచ్చని అర్థమైంది. ఇకపోతే ఈషకు అరవింద సమేత కెరీర్ పరంగా పెద్ద ప్లస్ అవుతుందనే అంచనా వేస్తున్నారంతా.
Please Read Disclaimer