విజయ్ దేవరకొండకు ఈసీ స్పెషల్ సర్ ప్రైజ్

0

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘టాక్సీవాలా’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ‘టాక్సీవాలా’కి ముందు వచ్చిన ‘నోటా’ చిత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు హోప్స్ మొత్తం టాక్సీవాలా పైనే పెట్టుకున్నాడు. నవంబర్ 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విజయ్ కి ఈ సమయంలోనే అనూహ్యమైన సర్ ప్రైజ్ వచ్చింది. అయితే అది సినీ పరిశ్రమ తరఫున కాదు. ఎన్నికల కమిషన్ నుంచి!

మహబూబ్ నగర్ జిల్లాకు విజయ్ దేవర కొండ ను ప్రత్యేక అంబాసిడర్ గా నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఓటింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖుల్ని అంబాసిడర్లుగా నియమిస్తున్నట్టు సీఈవో రజత్ కుమార్ తెలిపారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ – టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా – బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ – ప్రముఖ ప్రజాకవి – గాయకుడు గోరేటి వెంకన్న తదితరులు అంబాసిడర్లుగా ఉంటారని వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్ గా సినీనటుడు విజయ్ దేవరకొండను నియమించినట్టు చెప్పారు. ఇక..ఎన్నికల్లో దివ్యాంగులు – మహిళలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నట్టు ఆయన చెప్పారు.
Please Read Disclaimer