ఒకరితో నిశ్చితార్ధం మరొకరితో పెళ్లి

0cheated-marriageతనతో నిశ్చితార్ధం అయ్యాక మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఓ యువతి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్‌రావు శుక్రవారం తెలి పారు. వివరాలు.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్లకు చెందిన కన్నారపు స్వాతి అనే యువతితో వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్‌నగర్‌ గ్రామానికి చెందిన ఇల్లందుల రాజశేఖర్‌తో నవంబర్‌ 26న ఇరు గ్రామాల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. అదే రోజు వరకట్నం కానుకుల కింద రాజశేఖర్‌కు రూ.70 వేల నగదు అందజేశారు. ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా రాజశేఖర్‌ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని తనను మోసం చేశాడని బాధిత యువతి శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.