పవన్ ఫ్యాన్స్ కు రేణు షాక్

0Renu-Desai-Inteview-on-pawa”హేయ్.. నేను సాధ్యమైనంత వరకు పొలిటికల్ ట్వీట్లను వేయను తెలుసా. ఎప్పుడూ కూడా వాటికి దూరంగా ఉంటాను. ఏది నిజమో.. ఏది నీతో.. అదే జరగాలను కోరుకుంటున్నా” అంటూ ట్వీటేసింది పవన్ కల్యాణ్ మాజీ భార్య.. మాజీ హీరోయిన్ రేణు దేశాయ్. ఇంతకీ ఇదంతా దేని గురించో తెలుసా? పవన్ అభిమానులు చాలామంది ‘వదినా కాస్త స్పెషల్ స్టాటస్ అంశం గురించి ట్వీటేయవూ’ అంటూ అమ్మడు ఇలా స్పందించింది.

మొత్తానికి ఒక ప్రక్కన పవన్ కళ్యాణ్ స్పెషల్ స్టాటస్ అనే అంశంపై భారీ రేంజులో పోరాటానికి సన్నద్ధం అవుతుంటే.. దానిని కేవలం ఒక పొలిటికల్ విషయంగానే రేణు అభివర్ణించడం కాస్త షాకింగే. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టాటస్ ఇవ్వడం అనేది పొలిటికల్ అంశం కాదు. నైతికంగా రావాల్సిన హక్కును కాలరాసి.. పొలిటికల్ క్లాస్ చేస్తున్న పాలిటిక్స్ అవి. ఈ విషయంపై రేణు డైరెక్టుగా ఇలా నేను పొలిటికల్ ట్వీట్లు వేయను అనడం చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కూడా షాకింగానే ఉందిలే. భలే హ్యాండిచ్చేసిందండీ అంటున్నారు జనాలు.

ఏదేమైనా కూడా.. ఇప్పటివరకు నిఖిల్ అండ్ తనిష్ వంటి యంగ్ హీరోలు మాత్రమే స్పందించారు. పవన్ కళ్యాణ్ తరువాత ఇంకా ఒక్క స్టార్ హీరో కూడా ఈ విషయంపై నోరు మెదపట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో!!