హ్యాపీడేస్‌ నటి కన్నుమూత

0erin-moran-dies-at-56ప్రముఖ హాలీవుడ్‌ నటి ఎరిన్‌ మోరాన్‌(56) కన్నుమూశారు. నిన్నమొన్నటి వరకు ఆరోగ్యంగానే ఉన్న ఆమె హఠాత్తుగా మరణించారు. శనివారం మధ్యాహ్నం తమకు ఆమె చనిపోయినట్లు కబురందిందని ఆ వెంటనే అక్కడికి చేరుకున్నామని, ఆమె మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

ఎరిన్‌ 1970లో హాలీవుడ్‌ విడుదలైన హ్యాపీ డేస్‌లో జోనీ అనే పాత్రలో అద్భుతంగా నటించారు. అంతేకాకుండా 1982లో ప్రారంభమైన జోనీ లవ్స్‌ చాచీ అనే సిరీస్‌లల్లో కూడా నటించింది. ఈ సందర్భంగా ఆమెకు హాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆమె ఇండియానాలోని టైలర్‌ పార్క్‌లో ఉండేవారు.